Husband: భార్యను చంపి 15 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న భర్త.. ఒకే ఒక్క క్లూ తో పోలీసులు ఎలా పట్టేశారంటే..!
ABN, First Publish Date - 2023-09-22T09:43:47+05:30
వాలెంటైన్స్ డే రోజే భార్యను చంపిన ఇతను చేసిన ఒకే ఒక మిస్టేక్ కారణంగా 15ఏళ్ల తరువాత పోలీసులకు దొరికాడు.. ఆ తరువాత జరిగింది తెలిస్తే షాకవుతారు..
భార్యను భర్త చంపడం, భార్య భర్తను చంపించడం వంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్న కాలమిది. తప్పు చేసి తప్పించుకోవడం అనేది అరుదుగా జరుగుతుంది. తప్పులు చేయడానికి నిందితులు ఎన్ని తెలివితేటలు ఉపయోగిస్తారో వారిని పట్టుకోవడానికి పోలీసులు అంతే తెలివితేటలు ఉపయోగిస్తారు. కానీ కొందరు తెలివిమీరిన దుండగులు ఉంటారు. తప్పు చేసి తప్పించుకుని ఎంచక్కగా ఏమీ తెలియని అమాయకుల్లా కొత్త జీవితం ప్రారంభిస్తారు. అతనూ అలాంటివాడే..భార్యను గొంతుకోసి మరీ హత్యచేసి ఏకంగా 15ఏళ్లు పోలీసుకు చిక్కకుండా జీవితం గడిపాడు. కానీ అతను చేసిన ఒకే ఒక మిస్టేక్ అతన్ని పోలీసులకు పట్టించింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
గుజరాత్(Gujarat) రాష్ట్రంకు చెందిన జినారాజ్ అనే వ్యక్తికి సజ్ని కృష్ణన్ అనే మహిళతో 2002 చివరిలో పెళ్లి జరిగింది. వారి పెళ్లి జరిగిన మూడు నెలలకే ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే రోజు తన భార్యను గొంతుకోసి హత్య చేశాడు(husband killed wife). పెళ్లికి ముందే అతను వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు, పెళ్లి కారణంగా తన ప్రియురాలితో రిలేషన్ చెడిపోతోందనే కారణంతో భార్యను హత్య చేశాడు. హత్య అనంతరం తన ప్రియురాలితో పారిపోయి తన పేరు అడ్రస్ మొత్తం మార్చుకుని బెంగుళూరులో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. దీనికి అతను తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు. సజ్ని కృష్ణన్ హత్యకేసు గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె భర్త ఆచూకి కనిపించకపోవడంతో అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. హత్య జరిగిన రోజు నిందితుడు తన భార్య బ్యాంకు ఖాతా నుండి డబ్బు డ్రా చేసుకుని పారిపోయినట్టు విచారణలో తెలియడంతో పోలీసులకు అతనిమీద అనుమానం కలిగింది. దాంతో మధ్యప్రదేశ్ లో ఉంటున్న అతని తల్లి దగ్గరకు వెళ్లి అతని గురించి ఆరా తీశారు. ఆ ఇంటికి వస్తున్న ఫోన్ కాల్ లిస్ట్ పరిశీలించారు. బెంగుళూరులో రిజిస్టర్ అయిన ల్యాండ్ లైన్ నెంబర్ , మొబైల్ నెంబర్ నుండి ఫోన్ కాల్స్ వస్తున్నట్టు వారు కనుగొన్నారు. ఆ నెంబర్ రిజిస్టర్ అయిన పేరును పరిశీలించగా అది జినారాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిదని, అతను ఆమెతో బెంగుళూరు(Bengaluru)లో సెటిల్ అయ్యాడని, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో అతని ఆచూకీ తెలుసుకుని పోలీసులు అతన్ని 2018లో అరెస్ట్ చేశారు.
Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. ఫోన్లో మాట్లాడుతూనే ఏకంగా రూ.లక్ష కొట్టేసిన కేటుగాళ్లు.. అసలేం చేశారంటే..!
బెంగుళూరులో సెటిల్ అయిన అతను భార్యాపిల్లలతో సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని విచారణలో తేలింది. రెండుసార్లు విదేశీ టూర్లు కూడా వెళ్ళొచ్చినట్టు తెలిసింది. అరెస్ట్ అనంతరం అతడిని అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఉంచారు. అప్పటినుండి అతను బెయిల్ మీద బయటకు రావడానికి ప్రయత్నం చేస్తునే ఉన్నాడు. తన తల్లికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ఆమెను ఎవరో 24లక్షలు మోసం చేశారని ఆమెకు తన సపోర్ట్ అవసరమని తన లాయర్ ద్వారా వాదన వినిపించాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఇతని అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించింది. దీంతో అతను గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాడు. భార్య మీద హత్య జరిగిన రోజు తను అసలు ఇంట్లో లేనని, వాలెంటైన్స్ డే కోసం కేక్, టెడ్డీ బేర్ కొనడానికి వెళ్లానని తనకు హత్యతో సంబంధం లేదని వాదించాడు. అన్యాయంగా తనను అరెస్టు చేసినందుకు తన తల్లి ఇబ్బందులు పడుతోందని చెప్పాడు. దీంతో జులై 20, 2023న తాత్కాలిక బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. ఆగస్టు 4, 2023తేదీన షరతులతో కూడిన బెయిల్ పై విడుదల అయ్యాడు. కానీ విడుదల అవ్వగానే అతను మళ్లీ పారిపోయాడు. ఈ సారి దేశం దాటి పారిపోయాడేమోననే అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అతని మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రస్తుతం ఇతని కోసం గాలింపు జరుగుతోంది.
Viral Video: ఇలాంటి ప్రేయసి దక్కినందుకు అతడు నిజంగా అదృష్టవంతుడంటూ.. నెటిజన్ల ప్రశంసలకు కారణమేంటంటే..!
Updated Date - 2023-09-22T09:53:35+05:30 IST