కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసిన 3 గంటలకే ఊహించని ఘటన.. 5 ఏళ్ల ఆ బాబు నిద్రపోగానే ఆ తల్లి చేసిన పనేంటంటే..
ABN, First Publish Date - 2023-03-20T15:13:34+05:30
పాపం.. ఆ తల్లి తన కొడుకు పుట్టిన రోజుకు ఘనంగా ఏర్పాట్లు చేసింది.. చుట్టు పక్కల వారందరినీ పిలిచి కొడుకు చేత కేక్ కట్ చేయించింది.. కొడుకు పుట్టిన రోజు నాడు కూడా తండ్రి ఎప్పటిలాగానే ఫుల్‌గా మద్యం సేవించి ఇంటికొచ్చాడు..
పాపం.. ఆ తల్లి (Mother) తన కొడుకు పుట్టిన రోజుకు (Birth Day) ఘనంగా ఏర్పాట్లు చేసింది.. చుట్టు పక్కల వారందరినీ పిలిచి కొడుకు చేత కేక్ కట్ చేయించింది.. కొడుకు పుట్టిన రోజు నాడు కూడా తండ్రి ఎప్పటిలాగానే ఫుల్‌గా మద్యం (Drunken Man) సేవించి ఇంటికొచ్చాడు.. అందరి ముందు తూలుతూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు.. అందరి ముందు పరువు పోవడంతో ఆ మహిళ తీవ్ర మనస్తాపానికి గురైంది.. బాబును పడుక్కోబెట్టి దారుణమైన పని చేసింది.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh)చింద్వారాలో ఈ ఘటన జరిగింది (Crime News).
చింద్వారాకు చెందిన 23 ఏళ్ల కరీనా తన భర్త నికేష్, ఐదేళ్ల కొడుకుతో కలిసి నివసిస్తోంది. నికేష్ మద్యానికి బానిస. ప్రతిరోజూ మద్యపానం చేసి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడడం అతడికి నిత్యకృతం. ఈ నెల 18వ తేదీన అతడి కొడుకు బర్త్‌డే. ఆ బర్త్ డే కోసం కరీనా ఘనంగా ఏర్పాట్లు చేసింది. చుట్టు పక్కల వారిందరినీ పిలిచి వారి సమక్షంలో కొడుకు చేత కేక్ కట్ చేయించింది. కొడుకు పుట్టిన రోజున కూడా నికేష్ మద్యం మత్తులోనే ఇంటికి చేరుకున్నాడు. అందరి ముందు తూలుతూ వచ్చాడు.
Shocking: కలికాలం అంటే ఇదేనేమో.. బాయ్‌ఫ్రెండ్ కోసం అమ్మాయిల గొడవ.. చివరకు ఎంత వరకు వెళ్లిందంటే..
ఆగ్రహించిన కరీనా, నికేష్ మధ్య వాగ్వాదం జరిగింది. భార్యను కొట్టిన నికేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కొడుకును నిద్రపుచ్చిన అనంతరం కరీనా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నికేష్ ఇంటికి తిరిగి వచ్చేసరికి కరీనా ఉరి వేసుకుని ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.
నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది.. ఒక్క అమ్మాయి మొత్తం మార్చేసింది.. అంటూ ఆ యువకుడు చేసిన పని ఏంటో తెలిస్తే షాక్
Updated Date - 2023-03-20T15:13:34+05:30 IST