Husband: వీడు మనిషా..? రాక్షసుడా..? ఏడాదిన్నర కూతురిని చంపి.. పాప మృతదేహం పక్కనే హాయిగా నిద్రపోయి..!
ABN, First Publish Date - 2023-09-28T12:54:21+05:30
నవమాసాలు మోసి, కనేది తల్లి అయితే కంటికిరెప్పలా కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేవాడు తండ్రి. కానీ ఇతను మాత్రం తండ్రి అనే పదానికే కళంకం తెచ్చాడు.
నవమాసాలు మోసి, కనేది తల్లి అయితే కంటికిరెప్పలా కాపాడుకుంటూ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడేవాడు తండ్రి. కానీ ఇతను మాత్రం తండ్రి అనే పదానికే కళంకం తెచ్చాడు. మాటలు కూడా నేర్వని చిన్నారిని గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా కూతురి మృతదేహం ప్రక్కనే హాయిగా నిద్రపోయాడు. ఆ పాపకే కనుక తిరిగి ప్రాణం వస్తే.. మాట్లాడే అవకాశం కలిగితే 'ఎందుకు నాన్నా నన్ను చంపావు? నన్ను చంపడానికే కన్నావా? నేనేం పాపం చేశాను? నీకు కూతురుగా పుట్టడమేనా నేను చేసిన తప్పా' అని నిలదీస్తుందేమో. ముక్కుపచ్చలారని చిన్నారి హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేస్తోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా బిద్నులో రాజీవ్ రాజ్ పుత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి నేహా అనే యువతితో 8ఏళ్ళ క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. పెద్ద అబ్బాయి ఆర్యన్ వయసు 5ఏళ్లు కాగా, కూతురు సప్న వయసు ఒకటిన్నర సంవత్సరం. భార్యాభర్తల మధ్య డబ్బు విషయమై గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలో రాజీవ్ తన భార్యను పుట్టింటికి వెళ్లి డబ్బు తీసుకురమ్మని గొడవ పడ్డాడు. దీనికి అతని భార్య నిరాకరించడంతో అతను కోపోద్రిక్తుడు అయ్యాడు. ఆ కోపంలోనే ఇంట్లో ఉన్న ఒకటిన్నర సంవత్సరం కూతురిని గొంతుకోసి చంపాడు(father killed daughter). ఆ తరువాత మృతదేహం పక్కనే హాయిగా నిద్రపోయాడు.
Viral News: ఇంత చిన్న వయసులోనే ఎంత పెద్ద మనసు తల్లీ.. 5 ఏళ్ల ఈ పాప ఎందుకిలా జుట్టునంతా తీసేయించిందంటే..!
భర్తతో గొడవ జరిగిన తరువాత ఇంటి పనులలో మునిగిపోయిన నేహా ఆ తరువాత కూతురిని వెతుకుతూ వెళ్లగా గదిలో రక్తపు మడుగులో ఉన్న కూతురు కనిపించింది. కూతురు పక్కనే హాయిగా నిద్రపోతున్న భర్త కూడా కనిపించాడు. ఆమె వెంటనే భయంతో కేకలు వేసింది. ఆమె అరుపులకు మేల్కొన్న రాజీవ్ తనకేమీ తెలియదని బుకాయించాడు. అక్కడి నుండి పారిపోవాలని ఇంటి నుండి బయటకు ఉరికాడు. కానీ నేహా అరుపులు విన్న ఇరుగు పొరుగువారు ఇంటి బయటే ఉండటంతో రాజీవ్ ను పట్టుకున్నారు. జరిగిన సంఘటన తెలిసుకుని రాజీవ్ ను చెట్టుకు కట్టేశారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో రాజీవ్ హత్య తప్పించుకోవడానికి అబద్దాలు చెప్పాడని, కూతురిని చంపిన విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం చూపించడం లేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోంది.
2000 Note: సెప్టెంబర్ 30 తర్వాత కూడా రూ.2 వేల నోటు మన వద్ద ఉంటే.. జైల్లో వేస్తారా..? జరిమానా విధిస్తారా..?
Updated Date - 2023-09-28T12:54:21+05:30 IST