ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Women's Day 2023: కట్నం ఇవ్వలేదని మూడంతస్తుల పైనుండి తోసేశారు.. నడవడమే కష్టమైన ఈ మహిళ ఇప్పుడేం చేస్తోందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-08T13:23:36+05:30

కాళ్ళు చేతులు సహకరించక, నడవలేక 17ఏళ్ళు నరకం అనుభవించిన ఈమె ఇప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వరకట్న వేధింపులు సమాజంలో వేళ్ళూనుకుపోయాయి. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారని అందరూ అనుకుంటారు. అది నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరొకవైపు వేధింపులకు గురయ్యేవారు, మోసపోతున్నవారు, చేయని తప్పులకు బాధితులుగా మారుతున్న మహిళలు ఉన్నారు. పూనమ్ కూడా అదే కోవలోకి చెందిన మహిళ. కట్నం తీసుకురాలేదనే కారణంతో మూడు అంతస్తుల పైనుండి అత్తమామలు తోసేశారు. ఈ సంఘటన తరువాత 17ఏళ్ళ పాటు మంచంపైన తన జీవితం గడిచింది. కానీ ఈమె ఇప్పుడు ఓ అధ్బుతంలా అనిపిస్తోంది. 3వేలమంది ఆడపిల్లలు ఈమె సమక్షంలో అందమైన జీవితాన్ని మలుచుకుంటున్నారు. ఎవరు ఈ పూనమ్? ఈమె చేస్తున్నదేంటి ?తెలుసుకుంటే..

ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బీహార్(Bihar) లో వైశాలి(Vaishali) జిల్లా ఉంది. బిందేశ్వర్ రాయ్ అనే వ్యక్తి అక్కడ నివసిస్తున్నాడు. ఇతనికి 1974, మార్చి 8వ తేదీన ఒక కూతురు పుట్టింది. ఆ పాపకు పూనమ్ అని పేరు పెట్టుకున్నారు. కొడుకులు ఉన్నా కూతురు పుట్టిన తరువాత బిందేశ్వర్ రాయ్ కి ఉద్యోగం వచ్చింది. దీంతో వారి జీవితాలు మెరుగయ్యాయి. పూనమ్ ని యువరాణిలా చూసుకునేవారు. చిన్నప్పటి నుండి పూనమ్ కు పెయింటింగ్ మీద ఆసక్తి ఉండేది. దాంతో బనారస్ యూనివర్సిటీ నుండి పెయింటింగ్ ఆనర్స్ లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. పూనమ్ కు 21ఏళ్ళు రాగానే పెళ్లి చెయ్యాలని తండ్రి నిర్ణయించుకున్నాడు. అబ్బాయికోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో మణిపాల్ యూనివర్సిటీ నుండి ఇంజనీర్ చేశాడంటూ ఓ సంబంధం వచ్చింది. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, బాగా సంపాదిస్తున్నాడని తెలిసి కట్నం లేకుండా పెళ్ళిచేసుకోమని పూనమ్ తండ్రి కోరాడు. అందుకు వారు కూడా ఒప్పుకున్నారు. సూది దగ్గర్నుండి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ వరకు ప్రతి ఒక్కటి కూతురికోసం పంపించారు. కానీ పెళ్ళి తరువాత అసలు నిజం బయటపడింది. అతను చదివింది కేవలం ఇంటర్ మాత్రమే అనే విషయం పూనమ్ కు, ఆమె కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది. వారు పూనమ్ తండ్రిని కట్నం అడిగినట్టు ఆ తరువాత తెలిసింది. అయినా పూనమ్ సర్టుకుపోయింది. భర్త రోజూ తాగొచ్చి కట్నం అడుగుతూ పూనమ్ ని కొట్టేవాడు. పూనమ్ ఓపికగా వారిని మార్చుకోవాలని ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఆమె గర్బవతి అయింది. బిడ్డ పుడితే వారందరూ మారతారని అనుకుంది కానీ ఆడపిల్ల పుట్టడంతో వారు ఇంకా దారుణంగా తయారయ్యారు.

పూనమ్ కు కూతురు పుట్టిన రెండు నెలల తరువాత ఒకరోజు టెర్రస్ మీద పనిచేస్తుంటే అత్తమామలు వెనుక నుండి వచ్చి ఆమెను తోసేశారు. మూడు అంతస్తుల పైనుండి ఆమె పడిపోయింది. కళ్ళుతెరిచేసరికి హాస్పిటల్ లో బెడ్ పైన నిస్సహాయ స్థితిలో ఉంది. కాళ్ళు చేతులు పూర్తిగా సహకరించకుండా పోయాయి. కనీసం బిడ్డకు పాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. తల్లిదండ్రులు పూనమ్ ను తమతో తీసుకొచ్చి వైద్యులకు చూపించారు. కానీ పెద్దగా మెరుగవ్వలేదు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17సంవత్సరాలు మంచానికే పరిమితమైంది. ఈ 17ఏళ్ళలో లేచి నడవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది పూనమ్. ఆమె మానసికంగా ధైర్యంగా మారిన సమయంలో తండ్రి మృతిచెందారు. దాంతో మళ్ళీ ఆమె నిరాశలోకి జారిపోయారు. కానీ తన కూతురిని చూసి ధైర్యం తెచ్చుకున్నారు.

Read also: అత్తాకోడళ్ల మధ్య వంట విషయంలో గొడవ.. చివరకు ఎంత పని జరిగిందంటే..


పెయింటింగ్ సామాగ్రి తెచ్చివ్వమని తన అన్నను అడిగి తనకెంతో ఇష్టమైన పెయింటింగ్ ను మళ్ళీ మొదలుపెట్టింది. రోజంతా గదిలో కూర్చుకుని పెయింటింగ్ వేసేది. అలా తనలో కొత్త ఉత్సాహం మొదలైంది. దీంతో ఆమె కాళ్ళలో కదలిక వచ్చింది.వాకర్ సహాయంతో ఇంటి నుండి బయటకు వెళ్ళి ఎంతో మంది మహిళలను కలుసుకుని వారి జీవితాల గురించి తెలుసుకునేది. అమ్మాయిలు ఆర్థికంగా నిలబడాలంటే సంపాదన ముఖ్యమని డ్రాయింగ్ నేర్పించేది. తను అత్తమామల దగ్గర బలహీనంగా ఉండడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని, మహిళలు శారీరకంగా దృఢంగా ఉండాలనే లక్ష్యంతో టైక్వాండో నేర్చుకుంది. ఈమె మెల్లిగా వాకర్ సహాయంతో అడుగులు వేస్తూ తాను నేర్చుకుని, ఎంతో మంది ఆడపిల్లలకు నేర్పించింది. తండ్రి పేరుతో సంస్థ స్థాపించి 3వేల మంది ఆడపిల్లలకు ఆత్మరక్షణ విద్య నేర్పించింది.ఈమె వేసిన పెయింట్ లు లక్షలాది రూపాయలకు అమ్ముడుపోతున్నాయి. ప్రధానమంత్రి మోదీని కలిసి ఆమె వేసిన పెయింటింగ్ ను అందించడం మరచిపోలేని అనుభూతి అని చెప్పింది.' ఒకప్పుడు బెడ్ పై నిస్సహాయంగా పడుకుని ఉన్న నేను ఇప్పుడు పెయింట్ వేస్తే లక్షరూపాయలకు అమ్ముడుపోయింది' అని ఆత్మవిసశ్వాసంతో చెబుతోంది. ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదనే విషయాన్ని మహిళా ప్రపంచానికి చెబుతోంది పూనమ్.

Updated Date - 2023-03-08T14:19:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising