ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad Book Fair : బుక్ ఫెయిర్ ముగింపు సభలో ప్రముఖుల ప్రసంగాలు..!

ABN, First Publish Date - 2023-01-01T22:41:57+05:30

భారత దేశం అనాదిగా నాస్తీక, అస్తిక వాదాలకు నిలయం.

Hyderabad Book Fair
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కళాభారతిలో ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభకు, ముఖ్య అతిధిగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షలు బి.వినోద్ కుమార్ హజరయ్యారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమా భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ బుక్ ఫెయిర్ అధ్యక్షలు జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షత వహించారు.

మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లడుతూ.. భారత దేశం అనాదిగా నాస్తీక, అస్తిక వాదాలకు నిలయమన్నారు. నిరంతర సాహిత్య చర్చల ద్వారా తాత్విక చింతనను భారతి విజ్ఞానాన్ని ఉపనిషత్తులను ఇతిహాస గ్రంథాల విజ్ఞానాన్ని దర్శించవచ్చన్నారు. తాను మహరాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన కాలంలో భాస్కరాచార్య గ్రంథాలను ప్రజలందరికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేశానని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యంగం ద్వారా సమాతా స్పూర్తిని ప్రజల మధ్య నింపడానికి కృషి చేశారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ఒగ్గుకథ కళకారుడు మిద్దే రాములు పేరు పెట్టడం సముచితమన్నారు. అలాగే చర్చా వేదకకు అలిశెట్టి ప్రభాకర్ పేరు అన్నివిధాల అమోదయోగ్యమన్నారు. ఈ బుక్ ఫెయిర్ 80 ఏళ్లు పైబడిన రచయితలను చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయన్నారు. ఈ వయస్సులో కూడా వారు ఉత్సాహంగా రచనలు చెయ్యడం అభినందనీయమన్నారు. సూర్తిదాయకమని చెప్పారు. మార్పును స్వగతించాలని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ .. ఇంటర్ నెట్ వచ్చాకా పిల్లల్లో వచ్చిన మార్పులు చూస్తూంటే ఆందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాని, నేటి విద్యావిధానంలో తోటి మనుషులతో ఎలా మెలగాలో నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. నైతిక విలువులు పెంపోందించే విధంగా విద్యావిధానం ఉండాలని అన్నారు. హైదరాబాద్ లో 100 స్కూళ్లలో సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నాం.. అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం, సమాజం అంటే ఏంటో తెలిపే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామన్నారు. తాము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏ భావజాలమైనా చర్చోపచర్చలు చేసేవాళ్లం, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కనిపించడం లేదన్నారు. గ్రాంథాలయాలను గ్రామ స్థాయిలోకి తీసుకుపోయోందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు బుక్ ఫెయిర్ నిర్వహకులు ప్రభుత్వం తరుపున చేయ్యవల్సిన సహకారాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చారు. పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలనే తల్లిదండ్రుల ఆకాంక్ష గొప్పదని తెలిపారు. ఇలాంటి బుక్ ఫెయిర్ లు మరిన్ని రావాలన్నారు.

జూలూరు గౌరిశంకర్ మాట్లడుతూ... భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తూందని అన్నారు. కరోనా తర్వాత ఇంత పెద్ద ప్రజా సముహాన్ని బుక్ ఫెయిర్ కలిపిందని చెప్పారు. పుస్తకాలు చడవడం ద్వారా మనుషుల్లో వివేకాన్ని పెంచుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా పుస్తకాలు, సాహిత్యం అధ్యయనం చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ అని పేర్కొన్నారు. పుస్తక అధ్యయనం చేసిన వాడు ఇతరుల భావాలను అర్ధం చేసుకోగరన్నారు. నిరంతర పుస్తక అధ్యయనం, సాహిత్య చర్చలు మానవ మేథస్సును విసృత పరుస్తాయని అన్నారు. ఈ సంవత్సరం గతంతో పోలిస్తే యువ పాఠకుల సంఖ్య అమోఘంగా పెరిగిందని చెప్పారు. తెలంగాణలో నూతనంగా వేలమంది కవులు, రచయితలు ఉన్నారని, పుస్తక ప్రదర్శనలో తెలుసుకున్నామన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్వర్వంలో ఒక్కరోజులోనే 10 లక్షల మంది స్పందించడం అద్భతమన్నారు.

ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లడుతూ.. పుస్తకం చదవడం వల్ల వికాసం పెరుగుతుంది. పుస్తకం అమ్మబువ్వతో సమానమన్నారు. ఈ సందర్భంగా బిసి కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్టమోహన్ మాట్లడుతూ... మన తెలంగాణ సాహిత్య పరిమళాలు నలుదిశల తీసుకువచ్చేందుకు హైదరాబద్ పుస్తక ప్రదర్శన ఎంతో కృషి చేస్తూందన్ని చెప్పారు. సావిత్రబాయి పూలే గూలం గిరి తొలి పుస్తక ప్రదర్శన అన్నారు. విజ్ఞాన భాంఢాగారం విశ్వవ్యాప్తంగా కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, పాఠశాల మౌలిక వసతుల సంస్ధ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, పాడి పడి పరిశ్రమల సంస్థ చైర్మన్ సొమా భరత్, ఉస్మానియా యూనివర్సీటి ఆంగ్ల విభాగ ఆచార్యలు కొండ నాగేశ్వర్, బుక్ ఫెయిర్ కోశాధికారి రాజేశ్వర్ రావు, కార్యదర్శి సృతికాంత్ భారతి, బుక్ ఫెయిర్ ఉపాధ్యాక్షలు కోయా చంద్ర మోహన్, నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటి మెంబర్ వాసు, తదితరలు పాల్లొన్నారు.

Updated Date - 2023-01-02T07:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising