ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హైనాల ఐక్యమత్యం.. తలవంచిన మ‌ృగరాజు

ABN, First Publish Date - 2023-09-13T19:55:12+05:30

సింహం నోటికి చిక్కిన ఏదైనా జీవి ప్రాణాలతో ఉంటుందా? చెప్పడం కష్టమే కదూ.. కానీ ఓ చోట హైనాల ఐక్యమత్యం మృగరాజుని ఓడించింది. హైనాల భీకర పోరాటంతో మరో హైనా ప్రాణాలతో బయటపడగలిగింది.

Lion

సింహం నోటికి చిక్కిన ఏదైనా జీవి ప్రాణాలతో ఉంటుందా? చెప్పడం కష్టమే కదూ.. కానీ ఓ చోట హైనాల ఐక్యమత్యం మృగరాజుని ఓడించింది. హైనాల భీకర పోరాటంతో మరో హైనా ప్రాణాలతో బయటపడగలిగింది. ఆఫ్రికన్ అడవిలో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దక్షిణాఫ్రికాలోని అరధుస సఫారీ లాడ్జిలో జరిగిన ఈ వీడియోలను మార్గట్, మ్యాడీ లోవె చిత్రీకరించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఓ చోట కళేబరాన్ని హైనాల సమూహం తింటూ ఉంది. అకస్మాత్తుగా అక్కడికి సింహం పరిగెత్తుకుంటూ వచ్చింది.దీంతో హైనాలు చెరోదిక్కున పారిపోయాయి. కానీ ఓ హైనా మాత్రం మృగరాజుకి చిక్కింది. సింహం దాన్ని నోట కరుచుకుని ఊపిరి సలపనీయకుండా చేసింది.


తమ సహచరుడు ఆపదలో ఉందనే విషయాన్ని గుర్తించిన మిగతా హైనాలు ఒక్కొక్కటిగా సింహంపై దాడి చేయసాగాయి. హైనాలు కరుస్తుండటంతో తన ప్రాణాలు కాపాడుకునేందుకు సింహం నోటికి అంది వచ్చిన ఆహారాన్ని వదిలేసింది. మిత్రుడిని కాపాడామన్న ఆనందంలో హైనాలు ఉండగా.. బతుకుజీవుడా అంటూ సింహం అక్కడి నుంచి వెళ్లిపోయింది. హైనాల పోరాట పటిమపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐక్యమత్యంగా ఉంటే గెలుపు తథ్యం అని మూగజీవులు చాటి చెప్పాయని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇప్పటివరకు యూట్యూబ్ లో 25 లక్షల మందికి పైగా చూశారు.

Updated Date - 2023-09-13T20:01:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising