TarakaratnaHealth: నేను చెపితే బాగోదు: కళ్యాణ్ రామ్
ABN, First Publish Date - 2023-02-08T12:40:42+05:30
తను చెపితే బాగోదు అని చెప్పాడు. ఆ విషయాలు అన్నీ తను చెప్పేకన్నా హాస్పిటల్ వాళ్ళు చెపితేనే బాగుంటుంది అని చెప్పాడు. తనని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడగటం సరి కాదు అని కూడా చెప్పాడు.
నందమూరి కళ్యాణ్ (Nandamuri Kalyan Ram) రామ్ 'అమిగోస్' (Amigos) సినిమా ప్రచారానికి మీడియా వాళ్ళని కలిసాడు. అందులో భాగంగానే అతని కజిన్ తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్యం (#TarakaratnaHealth) ఎలా వుంది అని ఒక ప్రశ్నకి కళ్యాణ్ రామ్ చెప్పను అన్నాడు. తను చెపితే బాగోదు అని చెప్పాడు. ఆ విషయాలు అన్నీ తను చెప్పేకన్నా హాస్పిటల్ వాళ్ళు చెపితేనే బాగుంటుంది అని చెప్పాడు. తనని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడగటం సరి కాదు అని కూడా చెప్పాడు. (#TarakaratnaHealth)
'అమిగోస్' సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు పోషిస్తున్నాడు. అందులో విలన్ కూడా తానే పోషిస్తున్నాను మొదట్లో కొంచెం భయం వేసింది అని అన్నాడు. ఎందుకంటే ఇంతవరకు హీరో గా ఇన్ని సినిమాలు చేసి మళ్ళీ విలన్ ఏంటి, ఆ భాష, లుక్స్, అప్పీరెన్స్ అన్నీ కొంచెం నెగటివ్ గా వుంది చేయటం ఏంటి అని, కానీ అది బాగా ఎంజాయ్ చేసి చేశాను అని చెప్పాడు.
ఈ సినిమా కథ మనిషిని పోలిన మనుషులు వుంటారు అనే నేపధ్యం లో వచ్చినది. చిన్నప్పటి నుండి వింటూ ఉంటాం ఆలా వుంటారు 8 మంది అని, అందుకని అది మైండ్ లో రిజిస్టర్ అయిందని చెప్పాడు. అయితే తనకి ఎప్పుడూ తనలా వున్నవారు తారసపడలేదని చెప్పాడు. దీనికి ఒక వెబ్ సైట్ కూడా ఉందని, అందులో రిజిస్టర్ చేసుకుందాము అనుకున్నా కానీ చేసుకోలేదు. నాకు ఆసక్తి లేదు, కానీ ఈమధ్య వార్తలు చూస్తున్నాము కాదా. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పాదయాత్రలో అతనిలా వున్నా ఇంకో వ్యక్తి కూడా వున్నాడు అని చూడటం, అలాగే ఎలాన్ మస్క్ (Elon Musk) కి కూడా డాపుల్ గాంగర్ (Doppelganger) వున్నాడు అని తెలియటం, ఇవన్నీ వార్తల్లో చూసాక తను చేసిన ఈ సినిమా ఇప్పుడు సరిగా సరిపోయింది అని అనిపించింది. అందరికీ తెలుస్తోంది కూడా.
Updated Date - 2023-02-08T14:38:03+05:30 IST