ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ice Cream: ఐస్ క్రీమ్ గురించి విస్తుపోయే నిజాలు .. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే..

ABN, First Publish Date - 2023-07-05T11:54:15+05:30

తియ్యగా, చల్లగా ఇట్టే కరిగిపోతూ.. వివిధ ప్లేవర్లలో లభ్యమయ్యే ఐస్ క్రీములంటే పిల్లలకు, పెద్దలకు కూడా ఇష్టమే. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐస్ క్రీమ్(Ice Cream) పేరుతోనే నోరూరిపోతుంది చాలా మందికి. తియ్యగా, చల్లగా ఇట్టే కరిగిపోతూ.. వివిధ ప్లేవర్లలో లభ్యమయ్యే ఐస్ క్రీములంటే పిల్లలకు, పెద్దలకు కూడా ఇష్టమే. అయితే ఆరోగ్యం పాడవుతుందని, పిల్లలకు మంచిది కాదని చాలావరకు ఐస్ క్రీమ్ ను దూరం పెడుతుంటారు.ఇక పెద్దవాళ్లు ఐస్ క్రీమ్ తింటుంటే 'చిన్నపిల్లల్లా ఏంటదీ' అని కొందరు అంటుంటారు. యమలీల సినిమాలో యముడంతటి వాడే ఈ హిమక్రీములకు ఫిదా అయిపోయాడు. ఇక మనమెంతండీ బాబూ.. కానీ ఐస్ క్రీమ్ గురించి ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే కచ్చితంగా అవాక్కవుతారు.

ఐస్ క్రీం తినడం వల్ల గుండె సమస్యలు(Heart Problems) తగ్గుతాయి. పాల ఉత్పత్తులతో తయారైన ఐస్‌క్రీమ్‌లో, పాలు, క్రీమ్ కలపడం ద్వారా ఒక ప్రత్యేక రకం పొర ఏర్పడుతుంది. రక్తంలోకి చేరే చక్కెర వేగాన్ని మందగించడం ఈ పొరలో ఉన్న ప్రత్యేకత. ఐస్ క్రీమ్ లో గ్రైసెమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది(Low glycemic index), ఈ కారణంగా ఇది శరీరంలోకి విడుదలయ్యే చక్కెరలను నియంత్రిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Yellow Nails: చేతి గోళ్లు ఎప్పుడైనా ఇలా పచ్చగా మారిపోయాయా..? అయితే మీరు చేయాల్సిన పనేంటంటే..!


ఐస్ క్రీమ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఐస్ క్రీమ్ తినేవారికి మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి(Low diabetic chances). అధిక బరువు ఉన్నవారు కూడా ఐస్ క్రీమ్ ను ఎలాంటి సందేహం లేకుండా లాహించవచ్చంటున్నారు. మధుమేహం సమస్య ఉన్నవారు రోజులో తీసుకునే కార్భోహైడ్రేట్ల పరిమాణం నియంత్రించుకుని తక్కువ పరిమాణంలో అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ ఆస్వాదించవచ్చట(diabetic patients can eat ice cream). అయితే మొదటగా రక్తంలో చక్కెర స్థాయిలు పరిశీలించుకుని, వైద్యుల సలహా తీసుకుని తినడం మంచిది.

దంతాలు తొలగించిన తరువాత ఐస్ క్రీమ్ తినమంటూ వైద్యులు చెబుతుంటారు. ఉబ్బిపోయిన చిగుళ్లను(swollen gums) సాధారణ స్థితికి తీసుకుని రావడంలో ఐస్ క్రీమ్ ఔషదంలాగా పనిచేస్తుంది. చిగుళ్ల వాపు, చిగుళ్ళ నొప్పి ఉన్నప్పుడు కూడా ఇది ప్రయోజనకంగా ఉంటుంది. ఐస్ క్రీమ్ కోల్డ్ కంప్రెస్ గా పనిచేస్తుంది.

మానసిక ఒత్తిడి, చిరాకు, అసహనం వంటి సమస్యలు మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు ఒక చిన్న కప్పు ఐస్ క్రీమ్ తింటే చాలు. చాలావరకు మూడ్ సాధారణ స్థితికి వచ్చేస్తుంది(Ice Cream Control mood swings). ఇది మొదడులో సంతోషాన్ని ప్రేరేపించే సెరొటోనిన్ అనే హార్మోన్ ను(serotonin) విడుదల చేస్తుంది.

జలుబు, గొంతునొప్పి, జ్వరం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తినకూడదని అంటారు. కానీ ఐస్ క్రీమ్ మంచి ప్రోబయోటిక్. ఇందులో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఉపశమనంగా ఉంటుంది. అలాగే మహిళలు గర్భం ధరించిన సమయంలో(pregnancy time) హార్మోన్ సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. ఈ కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వైద్యుల సలహా తీసుకుని గర్భవతులు కూడా ఐస్ క్రీమ్ ను లక్షణంగా లాగించేయచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సహజంగా డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లతో తయారుచేసిన ఐస్ క్రీమ్ (natural ice cream)ను తింటేనే ఈ ప్రయోజనాలన్నీ ఉంటాయి. కృత్రిమ రంగులు, ప్లేవర్స్ కలిపిన ఐస్ క్రీములకు దూరంగా ఉండటం మంచిది.

Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్‌ను ఓపెన్ చేసి చూస్తే..!


Updated Date - 2023-07-05T11:54:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising