Viral Video: దీన్ని తినడం కంటే కాస్త విషం తాగడం బెటర్.. అంటూ నెటిజన్ల సెటైర్లు.. ఐస్‌క్రీమ్‌ను దేనితో తయారు చేశారో చూస్తే..!
ABN, First Publish Date - 2023-09-15T18:43:55+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వంటకాలకు సంబంధించిన వీడియోలో కళ్ల ముందుకు వస్తున్నాయి. విచిత్రమైన వంటకాలు చాలా మందిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లను విచిత్రంగా తయారు చేస్తుండడం షాక్ కలిగిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వంటకాలకు సంబంధించిన వీడియోలో కళ్ల ముందుకు వస్తున్నాయి. విచిత్రమైన వంటకాలు చాలా మందిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మంది ఇష్టపడే ఐస్‌క్రీమ్‌లను (Ice creams) విచిత్రంగా తయారు చేస్తుండడం షాక్ కలిగిస్తోంది. తాజాగా ఓ వ్యక్తి ఐస్‌క్రీమ్‌ను పచ్చి మిర్చితో తయారు చేశాడు (Ice creams with green chillies). పచ్చి మిరపకాయలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ రోల్‌ను ఎలా తయారు చేయాలో చూపించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.
thehungrysurati అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. సూరత్ (Surat)లోని ఓ దుకాణంలో ఓ వ్యక్తి ``చిల్లీ రోల్ ఐస్‌క్రీం`` (Chilli Roll Ice Cream) తయారు చేశాడు. పచ్చి మిరపకాయలను ఉపయోగించి ఆ వ్యక్తి ఐస్‌క్రీమ్ రోల్స్ తయారు చేశాడు. చాలా ఘాటుగా ఉండే ఆ ఐస్‌క్రీమ్‌ను ప్లేట్లో వేసి అందించాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మందికి పైగా వీక్షించారు.
Viral Video: రోడ్డు పక్కన పానీ పూరీ తినే అలవాటుందా..? ఒక్కసారి ఈ వీడియోను చూడండి..!
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``బాబోయ్.. ఈ ఐస్‌క్రీమ్‌ను ఎలా తినాలి``, ``ఇదెక్కడి పైత్యం``, ``ఇన్స్టాగ్రామ్ డిస్లైక్ బటన్‌ను కూడా అందించాలి``, ``స్పైసీ ఫుడ్ తినేవారు ఐస్‌క్రీమ్ ఎందుకు తినాలి``, ``డబ్బు వృథా ఆపాలి``, ``దీన్ని తినడం కంటే కాస్త విషం తాగడం బెటర్`` అని చాలా మంది కామెంట్లు చేశారు.
Updated Date - 2023-09-15T18:43:55+05:30 IST