ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

edible oil: అదే జరిగితే..మరోసారి వంట నూనె ధరలు ఆకాశాన్ని తాకుతాయి..

ABN, First Publish Date - 2023-02-16T10:06:58+05:30

వంటనూనే ధరలు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. రెండు, మూడేళ్ల క్రితం లీటరుకు రూ.80,90లు పలికిన వంట నూనె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంటనూనే ధరలు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. రెండు, మూడేళ్ల క్రితం లీటరుకు రూ.80,90లు పలికిన వంట నూనె ధరలు.. ఆ తర్వాత రూ.200లకు చేరుకున్నాయి. ఏడాది నుంచి కాస్త తగ్గి ఇప్పుడు రూ.150లకు పైనే ఉన్నాయి. అయితే..మరోసారి వంటనూనె ధరలు పెరగబోతున్నాయనే సంకేతాలు ప్రజానికాన్ని కలవరపెడుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే చుక్కలు చూస్తున్న సామాన్యులకు త్వరలోనే భారీ షాక్ తగలనుంది. రష్యా, ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో విపరీతంగా పెరిగిన వంటనూనె ధరలు కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. హమ్మయ్య అని కాస్త ఊపిరిపీల్చుకునే లోపే మరోసారి సామాన్యులపై వంట నూనెల పిడుగు పడబోతోంది. మన దేశంలో అధికంగా ఉపయోగించే నూనె పామాయిల్‎ని ప్రస్తుతం ఇండోనేషియా నుంచి అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. తాజాగా ఇండోనేషియా పామాయిల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఇండోనేషియా నుంచి పామాయిల్ దిగుమతులు తగ్గిపోతే.. ఆ ప్రభావం వంటనూనె తీవ్రంగా ఉంటుంది. సరఫరా తగ్గితే ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మన దేశంలో పామాయిల్ సహా ఇతర వంటనూనెలు 10శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. భారత్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. దేశంలో వంట నూనె ధరలు మరోసారి కొండెక్కితే..మరోసారి సామాన్యులకు చుక్కలు చూపుతాయి. గతేడాది కూడా ఇండోనేషియా ఇలానే ఒక్కసారిగా పామాయిల్ ఎగుమతులను నిలిపివేసింది.

ఈ సమయంలో భారత్ మలేషియా నుంచి ఎక్కువ మొత్తంలో పామాయిల్ ను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో దేశీయ మార్కెట్ లో పామాయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. భారత్ ప్రతి ఏటా ఇండోనేషియా నుంచి వార్షికంగా.. రూ.80వేల టన్నుల పామాయిల్ ను దిగుమతి చేసుకుంటోంది. దేశంలో మొత్తం వంటనూనెల వినియోగంలో పామాయిల్ వాటా 40 శాతానికి పైగానే ఉంటుంది. ఏది ఏమైనా..నిత్యావసరమైన వంటనూనె ధర పెరగడం అనేది.. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వంట నూనె పెరగడం పిడుగు లాంటి వార్తనే చెప్పాలి.

Updated Date - 2023-02-16T10:49:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising