Tomato Price: టమోటాల రేటేమో కానీ వీళ్ల క్రియేటివిటీ మాత్రం పీక్స్‌కు వెళ్లిపోయిందిగా.. ఓ వ్యక్తి 2 కిలోల టమోటాలు కొని..!
ABN, First Publish Date - 2023-07-10T16:21:53+05:30
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ టమోటా ధరలు. రోజురోజుకు పెరిగిపోతున్న టమోటా ధరలు చాలా మందిని భయపెడుతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోనూ కిలో 100 రూపాయలకుపైగానే ఉంది. దీంతో టమోటా వినియోగం బాగా తగ్గిపోయింది. మార్కెట్లో కూడా టమోటాలు పెద్దగా కనిపించడం లేదు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ టమోటా (Tomato) ధరలు. రోజురోజుకు పెరిగిపోతున్న టమోటా ధరలు (Tomato Price) చాలా మందిని భయపెడుతున్నాయి. దేశంలోని అన్నీ రాష్ట్రాల్లోనూ కిలో 100 రూపాయలకుపైగానే ఉంది. దీంతో టమోటా వినియోగం బాగా తగ్గిపోయింది. మార్కెట్లో కూడా టమోటాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టమోటా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. టమోటా ధరలపై నెటిజన్లు రకరకాల మీమ్స్ (Memes on Tomato) సృష్టించి వైరల్ చేస్తున్నారు.
టమోటా ధరలపై కంటెంట్ క్రియేటర్ కుషాల్ (Kushal Pawar) ఓ పేరడీ సాంగ్‌ను రూపొందించాడు. ఆ సాంగ్ ఆధారంగా ఓ వీడియోని షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో షేర్ చేశాడు. ఆ వీడియో నెట్టింట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఆ సాంగ్ అప్‌లోడ్ చేసిన కొద్ది గంటల్లోనే నాలుగున్నర లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. ప్రస్తుతానికి దాదాపు 10 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఇక, కామెంట్లైతే చెప్పనక్కర్లేదు. ఎంతో మంది ఆ వీడియోపై ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Viral News: కరెంటు బిల్లు తగ్గించేందుకు ఓ వ్యక్తి వింత టెక్నిక్.. ఒక్క స్విచ్ వేస్తే మూడు ఫ్యాన్లు తిరిగేలా పక్కా ప్లాన్..
టమోటాల రేటు పెరిగిపోవడంతో మధ్య తరగతి వాళ్లు పడుతున్న కష్టాలను కుషాల్ వర్ణించాడు. సాంబర్ నుంచి పావ్‌బాజీ వరకు టమోటా లేనిదే వంటకాలకు రుచి రాదంటూ ఆ పేరడీ సాంగ్ (Tomato Song)ను కుషాల్ రూపొందించాడు. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ``టమోటా కష్టాల్ని అద్భుతంగా వర్ణించావు`` అని మెచ్చుకుంటున్నారు.
Updated Date - 2023-07-10T16:22:32+05:30 IST