ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Two Transgenders:ఆ ఇద్దరు ట్రాన్స్ జెండర్లు చేసే పని మీకు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ABN, First Publish Date - 2023-03-02T09:38:12+05:30

మాజంలో వారు అంటే అందరికీ చిన్న చూపే.. వాళ్లు చిన్న చూపే అయినా.. దగ్గరకి వెళ్లడానికి ఇష్టపడరు. అయితే..వాళ్లకు మనసు ఉంటది. మాములు మనుషుల్లాగే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సమాజంలో వారు అంటే అందరికీ చిన్న చూపే.. వాళ్లు చిన్న చూపే అయినా.. దగ్గరకి వెళ్లడానికి ఇష్టపడరు. అయితే..వాళ్లకు మనసు ఉంటది. మాములు మనుషుల్లాగే బ్రతకాలని ఉంటుంది. కానీ, సమాజంలో జెండర్ వివక్ష(Gender discrimination) వల్ల వాళ్లు బయటకు రాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు(Transgenders) ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ(Telangana)లో తొలి ట్రాన్స్ జెండర్ కు ఫోటోగ్రఫీ కోసం లోను మంజూరు కాగా, మరో ట్రాన్స్ జెండర్‎కు ఫోర్ విల్లర్ డ్రైవింగ్ లైసెన్స్(Four Wheeler Driving License)జారీ అయ్యింది. ఇందులో కనిపిస్తున్న ఈమే పేరు ఆశాఢం ఆశా. ఈమే ఒక ట్రాన్స్ జెండర్. మాములు మనుషుల్లాగే బ్రతకాలని ఈమేకు ఉంటుంది. అయితే.. ట్రాన్స్ జెండర్ ఇప్పటికీ సమాజంలో వివక్ష పోవడం లేదు. వీరికి ఉపాధి దొరకదు.

పని చేద్దామ్ అంటే ఎవరు పని కల్పించరు. వీరు బ్రతకడానికి ఏకైక మార్గం బెగ్గింగ్ (Begging) మాత్రమే. అయితే..అందరూ ట్రాన్స్ జెండర్లు ఒకలా ఉండరు. తమ కాళ్ల మీద తాము నిలబడటానికి ప్రయత్నిస్తారు. అందులో మొదటి వరుసలో ఉంటారు ఆశాఢం ఆశ. ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్(Prime Minister's Employment Generation Program Scheme) కింది రూ.5 లక్షలు మంజూరు పొందారు. దీంతో వచ్చిన రుణంతో ఫోటో షాప్ పెట్టుకుంది ఆశ. లోన్ మంజూరైనందుకు ఎంతో ఆనందంగా ఉందని, తమపట్ల వివక్ష వీడి, తమ కాళ్ల మీద నిలబడేందుకు సమాజం ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు.

మరో ట్రాన్స్ జెండర్ పేరు నక్కా సింధు(Nakka Sindhu). ఈమేది జగిత్యాల జిల్లా(Jagityala district) బుగ్గారం గ్రామం(Buggaram village). 10 ఏళ్ల నుంచి కరీంనగర్(Karimnagar)లోనే ఉంటుంది. ఇటీవలే ఈమే 4 విల్లర్ డ్రైవింగ్ నేర్చుకుంది. ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్(Driving License Govt) జారీ చేసింది. రాష్ట్రంలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన రెండో ట్రాన్స్ జెండర్ ఈమే. సమాజంలో ఎంతో వివక్షను ఎదుర్కొన్నానని సింధూ చెప్తోంది. ఫోర్ విల్లర్ కొనుకునేందుకు దరఖాస్తూ చేసుకుని తన కాళ్ల మీద తను నిలబడి ఆదర్శంగా నిలుస్తానని అంటోంది. ఇతరుల లాగే సమాజం తమని చేరదియాలని కోరుకుంటోంది. ట్రాన్స్ జెండర్స్ అంటే.. బయటి సమాజంలోని వారందరినీ బెదిరిస్తారని, డబ్బులకోసం భయపెడుతారని వివక్ష ఉంది. అయితే..మంచి మార్గంలో వెళ్లే వారు ఉంటారని ఈ ట్రాన్స్ జెండర్స్ చెప్తున్నారు. అందరి లాగే మాములు మనుషుల్లాగా ట్రీట్ చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2023-03-02T10:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!