ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railway; రైల్లో ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ టికెట్.. ట్రైన్ రాగానే తన సీటును వెతుక్కుంటూ వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..!

ABN, First Publish Date - 2023-08-08T16:24:03+05:30

భారతదేశంలో అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ భారతీయ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకుంటే రైలు ప్రయాణానికి మించిన సౌకర్యం వేరే ఎక్కడా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రయాణం కోసం రైల్లో ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్నాడు. ట్రైన్ ఎక్కి సీటు దగ్గరకు వెళ్ళగానే..

భారతదేశంలో అతిపెద్ద ప్రయాణ వ్యవస్థ భారతీయ రైల్వే. రోజూ కోట్లాది మంది ప్రజలు రైలు ప్రయాణాలు చేస్తుంటారు. రిజర్వేషన్ చేసుకుంటే రైలు ప్రయాణానికి మించిన సౌకర్యం వేరే ఎక్కడా ఉండదు. ఓ వ్యక్తి తన ప్రయాణం కోసం రైల్లో ఏసీ కోచ్ లో రిజర్వేషన్ చేసుకున్నాడు. అతను తను ఎక్కాల్సిన ట్రైన్ రాగానే తన సీటు వెతుక్కుంటూ వెళ్ళాడు. తన సీటు దగ్గరకు చేరుకోగానే కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురిచేసింది. అక్కడి దృశ్యాన్ని ఫోటో తీసి ఏసీ కోచ్ లో పరిస్థితి ఇదీ.. అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

రిజర్వేషన్ ఉంటే తప్ప రైలు ప్రయాణాలు సౌకర్యంగా ఉండవు. అందుకే చాలామంది రిజర్వేషన్, ఏసీ కోచ్ లలో సీట్లు బుక్ చేసుకుంటారు. అతిప్ అలీ అనే వ్యక్తి కూడా ఢిల్లీ నుండి త్రిపురకు(Delhi to Tripura) ప్రయాణించేందుకు ఏసీ కోచ్ లో సీటు బుక్ చేసుకున్నాడు. ఢిల్లీలో అతను ట్రైన్ ఎక్కి తన సీటు వెతుక్కుంటూ వెళ్ళాడు. తన సీటు దగ్గరకు చేరుకుని సీటు వైపు చూసి షాకయ్యాడు. అది ఏసీ కోచ్ అయినా ఆ సీటు మీద, దిండు మీద, చుట్టుప్రక్కల బొద్దింకలు(cockroaches in AC coach) తిరుగుతూ కనిపించాయి. ఒకటో రెండో అయితే అతను వాటిని తరిమేసి తన సీటులో ప్రయాణించేవాడేమో.. కానీ అక్కడ ఒకటికి మించి బొద్దింకలు తిరుగుతూ చాలా అసహ్యంగా కనిపించాయి. కష్టం మీద ఆ సీటు మీద కూర్చున్నా బొద్దింకలు అతని మీదకు ఎక్కి పాకడం మొదలుపెట్టాయి. దీంతో అతను సహనం కోల్పోయాడు. తన సీటును,అక్కడ తిరుగుతున్న బొద్దింకలను ఫోటో తీసి ట్విట్టర్ లో షేర్ చేశాడు(shared in twitter). తన సీటు నెంబర్ ను పోస్ట్ లో పొందుపరిచి 'ఏసీ కోచ్ లో సీటులో పడుకుంటే బొద్దింకలు శరీరం మీదకు ఎక్కి మరీ తిరుగుతున్నాయి. రైళ్ళలో పరిశుభ్రత ఎక్కడ?' అంటూ అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ పోస్ట్ కు సెంట్రల్ రైల్వే, రైల్వే సేవ, సికింద్రాబాద్, హైద్రాబాద్ జోన్ లను కూడా ట్యాగ్ చేశాడు. దీంతో ఇతని పోస్ట్ వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్ట్ చూసిన రైల్వే వెంటనే స్పందించింది. అతను పోస్ట్ షేర్ చేసిన అరగంట లోపలే అతని ప్రాబ్లమ్ ను క్లియర్ చేసినట్టు అతనే తన పోస్ట్ లో కామెంట్ రూపంలో తెలియజేసాడు.

Viral: గే అని తెలిసి జాబ్‌లోంచి తీసేశారని బాధపడ్డాడు కానీ.. 4 ఏళ్లు తిరిగేసరికి రూ.40 లక్షల టర్నోవర్.. ఇంతకీ ఏం చేస్తున్నాడంటే..!



ఈ ఫోటో సదరు ప్రయాణీకుడు Aatif Ali అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ ఫోటో చూసిన తరువాత నెటిజన్లు తమకు రైలు ప్రయాణాలలో ఎదురవుతున్న సమస్యలను కామెంట్ చేయడం మొదలుపెట్టారు. 'ట్రైన్ లో ఆహారం కూడా ఏమీ బాగుండటం లేదని, అన్నం చాలా పూర్ క్వాలిటీతో ఉంటుందని ఒకరు కామెంట్ చేశారు. 'రైలు ప్రయాణాలలో కొత్తరకం కాంతి ఇదేనేమో' ఇంకొకరు సెటైర్ వేశారు. మరికొందరు ఈ రైల్వే సమస్యను కాస్తా రాజకీయ సమస్యగా మార్చి రాజకీయ చర్చలు చేస్తున్నారు.

Dying in sleep: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? క్షణాల్లోనే మరణం.. అసలు ఎందుకిలా జరుగుతుందంటే..!


Updated Date - 2023-08-08T16:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising