ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. భారీ కొండచిలువతో ఆడుకుంటున్న బుడ్డోడు.. పేరెంట్స్‌పై నెటిజన్ల విమర్శలు!

ABN, First Publish Date - 2023-05-21T12:42:02+05:30

పెద్ద వాళ్లతో పోల్చుకుంటే చిన్నపిల్లలకు భయం తక్కువగా ఉంటుంది. ఏదో ప్రమాదమో, ఏది కాదో తెలుసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి వారు ప్రమాదకర వస్తువులు, జంతువులతో కూడా ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద వాళ్లతో పోల్చుకుంటే చిన్నపిల్లలకు (Children) భయం తక్కువగా ఉంటుంది. ఏదో ప్రమాదమో, ఏది కాదో తెలుసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి వారు ప్రమాదకర వస్తువులు, జంతువులతో కూడా ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే పిల్లలకు ఊహ వచ్చే వరకు పెద్ద వాళ్లు వారిని కనిపెట్టుకుని ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో (Viral Video) ఓ కుర్రాడు భారీ కొండచిలువతో (Python) ఆడుకుంటూ కనిపించాడు. ఆ వీడియో చాలా మందికి షాక్ కలిగించింది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు నడి వీధిలో ఓ భారీ కొండ చిలువతో ఆడుకుంటున్నాడు (Toddler playing with huge python). దానిని ఎత్తి పైకి లేపేందుకు ప్రయత్నించాడు. దాని మీద కూర్చుని ఆడుకుంటున్నాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అది పెంపుడు కొండ చిలువే అయినా కుర్రాడిని అలా వదిలేయడం చాలా దారుణమని కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే ఆ కుర్రాడి లైఫ్ రిస్క్‌లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.

Crime News: ఇలాంటి కూతురు ఎవరికీ ఉండకూడదంటూ.. ప్రేయసిని చంపి ప్రియుడి బలవన్మరణం.. చివరగా రికార్డ్ చేసిన వీడియోలో..!

ఆ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన Figen అనే యూజర్ ఆ కుర్రాడి తల్లిదండ్రులకు బాధ్యత లేదని కామెంట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 97 వేల మంది చూశారు. వీడియో తీయడం కోసం ఆ కుర్రాడితో, కొండచిలువతో కూడా క్రూరంగా వ్యవహరించారని ఒకరు కామెంట్ చేశారు. ఇది పాత వీడియోనే అయినప్పటికీ ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది.

Updated Date - 2023-05-21T12:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising