ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Muskan Agrawal: ఎవరీ ముస్కాన్ అగర్వాల్..? ఏకంగా రూ.60 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆమెకు ఎలా వచ్చిందంటే..!

ABN, First Publish Date - 2023-11-10T10:25:57+05:30

ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రేమ, స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్ట ప్రణాళిక ఉంటే విజయం మన సొంతమవుతుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టమైనా అధిగమించగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి.

Muskan Agrawal: ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రేమ, స్పష్టమైన లక్ష్యం, నిర్దిష్ట ప్రణాళిక ఉంటే విజయం మన సొంతమవుతుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టమైనా అధిగమించగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే మనం అనుకుంది అనుకున్నట్టు సాధించగలం. ఇదిగో ఇవన్నీ కలగలిపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఔరా అనిపించింది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముస్కాన్ అగర్వాల్ అనే ఐఐటీ విద్యార్థిని. ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్‌ దిగ్గజం లింక్డిన్‌(LinkedIn) లో సాఫ్ట్‌వేర్ కొలువు కొట్టేసింది. దీంతో ప్రస్తుతం నెట్టింట ముస్కాన్ గురించి చర్చ నడుస్తుంది. ఆమె గురించి తెలుసుకుని నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఐఐఐటీ-ఉనా (Indian Institute of Information Technology- Una) లో బీటెక్ (BTech) చదువుతున్న ముస్కాన్ అగర్వాల్ ఇలా అద్భుత విజయం సాధించి అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది.

Pakistan: పాకిస్తాన్ పౌరులకు మరో కొత్త కష్టం.. ఉన్నట్టుండి పాస్‌పోర్టుల జారీనీ ఆ దేశం ఎందుకు బంద్ చేసిందంటే..!

రూ.60 లక్షల ప్యాకేజీతో ఆమెకు జాబ్ ఎలా వచ్చిందంటే..!

అసలు సాఫ్ట్‌వేర్‌ కొలువంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ఆపై ప్రోగ్రామింగ్‌తో దోస్తీ కట్టాలి. అలాంటి కోడింగ్‌లో ముస్కాన్ అగర్వాల్ దిట్ట. గత కొన్నేళ్లుగా ఆమె కోడింగ్ నేర్చుకుంటోంది. గతేడాది ‘టెక్ గిగ్ గీక్ గాడెస్ 2022’ (TechGik Geek Goddess 2022) కోడింగ్ పోటీల్లో పాల్గొన్న 69వేలకు పైగా మంది మహిళా కోడర్‌లను ముస్కాన్ ఓడించింది. ఈ పోటీల్లో విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్‌ ఉమెన్‌ కోడర్‌’గా నిలిచింది. టెక్‌గిగ్‌ గీక్‌ గాడెస్‌ ఈవెంట్‌లో ఫైనలిస్టులు ప్రోగ్రామింగ్ సొల్యూషన్‌ల కోసం 4గంటల పాటు కోడ్‌లను రాసింది. ఫలితంగా ఆమె రూ.1.5 లక్షలు బహుమతి సొంతం చేసుకుందని నిర్వాహకులు తెలిపారు. అలాగే ముస్కాన్‌ అగర్వాల్‌ లింక్డిన్‌లో మెంటార్‌షిప్‌కు ఎంపికయింది. మెంటార్‌షిప్‌కు ఎంపికైన 40 మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఈ మెంటార్‌ షిప్‌లో లింక్డిన్‌ నిపుణులు ఆయా విభాగాల్లో మెంటర్‌ షిప్‌కు సెలక్ట్‌ అయిన వారికి తగిన సలహాలు అందించడం జరుగుతుంది.

Viral: బామ్మా.. నీ ధైర్యానికి సలామ్.. 85 ఏళ్ల వయసులో.. క్రూర మృగాలు తిరిగే అడవిలో.. మూడు రోజుల పాటు ఒంటరిగా..!

కాగా, ముస్కాన్ 'గర్ల్స్‌స్క్రిప్ట్ ఫౌండేషన్' (Girlscript Foundation) భాగస్వామురాలు కూడా. ఇక సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌ (Software development engineer) గా ఉద్యోగం సంపాదించిన ఆమె.. ప్రస్తుతం బెంగళూరులోని లింక్డిన్‌ (LinkedIn) కంపెనీలో ఐదు నెలలకు పైగా పని చేస్తోంది. ముస్కాన్ చదువుతున్న కాలేజీ చరిత్రలో ఆమె సాధించిన రూ.60 లక్షల ప్యాకేజీనే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం.

Wife: బంధువుల ఇంటికి వెళ్తున్నట్టు భార్యకు చెప్పి.. సీక్రెట్‌గా ఇంటికి తిరిగొచ్చిన భర్త.. తెల్లారేసరికి ఊరంతా ఉలిక్కిపడే ఘటన..

Updated Date - 2023-11-10T10:28:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising