ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IRCTC Alert: రైలు ప్రయాణీకులకు ఐఆర్‌సీటీసీ ముఖ్య గమనిక.. యాప్‌ ద్వారా టికెట్లను బుక్ చేసే వాళ్లకు..!

ABN, First Publish Date - 2023-09-11T10:16:30+05:30

ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.

దూరప్రయాణాలు చేయాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యమే కాదు ప్రయాణ ఖర్చు కూడా దాదాపు 70శాతం ఆదా అవుతుంది. చాలామంది టూర్లకు వెళ్ళడం కోసం, ఇతర ముఖ్యమైన పనుల నిమిత్తం ముందుగానే రైలు టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇలా టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్‌సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది. అసలింతకూ టికెట్ల బుకింగ్ లో జరుగుతున్న పొరపాటు ఏంటి? దీనివల్ల ప్రయాణికులకు ప్రమాదం ఎలా పొంచి ఉంది? ఐఆర్‌సీటీసీ చేస్తున్న హెచ్చరిక ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

రైలు ప్రయాణాల కోసం టికెట్లు బుక్(Train tickets booking) చేసుకోవడానికి చాలామంది గూగుల్ ప్లే స్టోర్ లో ట్రైన్ కు సంబంధించి యాప్స్ డౌన్లోడ్ చేసి అందులో బుక్ చేస్తుంటారు. వీటిలో ఐఆర్‌సీటీసీ రైల్ కనెక్ట్(ITCTC Rail Connect) పేరుతో ఒక యాప్ చెలామణి అవుతోంది. ఇదొక నకిలీ యాప్(Fake App). ఈ యాప్ లో రైలు ప్రయాణం చేయాలని అనుకునే వారు టికెట్లు బుకింగ్ చేసుకుని సమస్యలలో చిక్కుకుంటున్నారు. మొదట కొందరు మోసగాళ్ళు ఈ రైలు యాప్ కు సంబంధించి లింక్ లు పంపి యాప్ ను డౌన్లోన్ చేసి టికెట్లు బుక్ చేసుకునే దిశగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. లేదా టికెట్స్ బుకింగ్ లో డిస్కౌంట్ చూపించడం చేస్తారు. ఎవరైనా సంబంధిత లింక్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసి టికెట్లు బుకింగ్ చేసుకున్నప్పుడు మొబైల్ పర్మిషన్ ద్వారా ప్రజలను తప్పుడు కార్యకలాపాల్లో ఇరుకున పెడుతున్నారు. టికెట్లు బుక్ చేసేముందు ప్రయాణికుల ఆదార్ వంటి వివరాలు నమోదు చేయడం ఐఆర్‌సీటీసీ యాప్ లో అయినా తప్పనిసరి. అయితే నకిలీ యాప్ లో ఆధార్ వంటి సమాచారం ద్వారా ప్రజలను పెద్ద ఇబ్బందులలోకి నెట్టేస్తున్నారు.

Viral Video: వాహ్.. ఏం క్రియేటివిటీ బాస్.. కరెంట్ అక్కర్లేదు, చేత్తో ఉతకనక్కర్లేదు.. బట్టలు ఉతకడానికి సరికొత్త ఐడియా..



ఈ కారణాల వల్ల, నకిలీ యాప్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ(IRCTC) ప్రకటన విడుదల చేసింది. ప్రజలు రైలు టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు అయితే గూగుల్ ప్లే స్టోర్(Google play store) నుండి ఐఆర్‌సీటీసీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, ఐఓఎస్ వినియోగదారులు(IOS users) అయితే యాపిల్ యాప్ స్టోర్(Apple App Store) నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇక ఏదైనా సమస్య ఎదురైతే ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్సైట్(IRCTC Website) https://irctc.co.in లో ఉన్న కస్టమర్ కేర్ నెంబర్ ద్వారా తమను సంప్రదించవలసిందిగా కోరింది.

Viral: సోషల్ మీడియాను భయపెడుతున్న ఫోటో.. షాపు బయట కాపలా కాస్తున్న సెక్యురిటీ గార్డుకు తల మిస్సింగ్.. అసలు రహస్యమేమిటంటే....


Updated Date - 2023-09-11T10:16:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising