H3N2 virus: దేశాన్ని వణికిస్తున్న ఈ కొత్త వైరస్ అంత ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ABN, First Publish Date - 2023-03-12T21:35:18+05:30
కరోనా (Corona) మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాన్ని H3N2 వైరస్ వణికిస్తోంది.
కరోనా (Corona) మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశాన్ని H3N2 వైరస్ వణికిస్తోంది. ఈ వైరస్ (H3N2 Virus) సోకి ఇటీవల ఇద్దరు భారతీయులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ సోకిన వారి సంఖ్య పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొంటున్నాయి. చలి కాలం నుంచి వేసవి కాలానికి వాతావరణం మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనబడితే సీజనల్ ఫ్లూ అనుకుని తాత్సారం చేయడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.
H3N2 ప్రాణాంతకమా?
సాధారణ ఫ్లూ లక్షణాలే ఈ వైరస్ బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. చాలా కొద్ది మందిలోనే శ్వాస ఆడకపోవడం వంటి సీరియస్ సమస్యలు కనిపిస్తున్నాయి. ఇది కూడా కోవిడ్-19 (Covid-19) లాగానే ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. ఇమ్యూనిటీ పవర్ (Immunity Power) కలిగిన వారిని ఈ వైరస్ ఏం చేయలేదు. అయితే శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారు, ఆస్తమా, డయాబెటిస్, పొగతాగే వారు, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వీరికి వైరస్ సోకితే కోలుకోవడం కాస్త కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
Viral: టైమ్ బాంబ్ అంటూ హెచ్చరించిన డాక్టర్.. దెబ్బకు 165 కిలోల బరువు తగ్గిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..
లక్షణాలు.. (Symptoms of H3N2 virus)
*జ్వరం
*దగ్గు
*ఒళ్లు నొప్పులు
*వాంతులు, వికారం
*ముక్కు కారడం
*విరేచనాలు
*శ్వాస సమస్యలు
నివారణ ఎలా?
కూలింగ్ వాటర్‌కు దూరంగా ఉండి రోజంతా వేడి నీళ్లు (Warm Water) తాగడం ఉత్తమం. అల్లం లేదా కొత్తిమీర వేసి మరిగించిన నీటిని తాగితే మరింత మంచిది. ఇక సులభంగా అరిగే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. సీ విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలి. వీలైనంత వరకు జనం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లినపుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అలాగే కోవిడ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో అలాంటి జాగ్రత్తలనే పాటించాలి. యాంటీ-బయాటిక్స్‌ను (Antibiotics) మరీ ఎక్కువ మోతాదులో వాడవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
Updated Date - 2023-03-12T21:35:18+05:30 IST