ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

iPhone 15: ఐఫోన్ 15‌ కింద పడితే పగిలిపోతుందా..? స్క్రీన్ డ్యామేజ్ అయిపోతోందా..? ఈ వ్యక్తి ఎలా టెస్ట్ చేశాడో చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-26T15:30:09+05:30

ప్రఖ్యాత ఆపిల్ కంపెనీ తాజాగా ఐఫోన్ సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూశారు. మార్కెట్లోకి విడుదల కాగానే యాపిల్ స్టోర్ల ముందు క్యూలో నిల్చుని మరీ కొనుక్కున్నారు.

ప్రఖ్యాత ఆపిల్ (Apple) కంపెనీ తాజాగా ఐఫోన్ సిరీస్ (Iphone 15) ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూశారు. మార్కెట్లోకి విడుదల కాగానే యాపిల్ స్టోర్ల ముందు క్యూలో నిల్చుని మరీ కొనుక్కున్నారు. ఐఫోన్ 15 బేస్ వేరియంట్ ధర రూ.80 వేల నుంచి మొదలు కానుంది. ఇక, ఈ సిరీస్‌లో అతి ఖరీదైన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ.2 లక్షల వరకు ఉంది. 15 సిరీస్‌లో ప్రో వేరియంట్లను చాలా దృఢమైన టైటానియంతో తయారు చేశామని, కింద పడినా అంత సులువుగా పగలదని ఆపిల్ కంపెనీ చెబుతోంది.

ఈ నేపథ్యంలో సామ్ కోల్ అనే యూట్యూబర్ (YouTuber Sam Kohl) ఆస్ట్రేలియాలో ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 14 ప్రో డ్రాప్ టెస్ట్ (iPhone 15 Drop test) చేశాడు. సిడ్నీలో రెండు ఫోన్లన డ్రాప్ టెస్ట్ చేసి పరీక్ష చేశాడు. ఆ ఫోన్లను పలుసార్లు కింద పడేశాడు. మొదట్లో రెండు ఫోన్లూ బాగానే ఉన్నాయి. అయితే అలా కింద పడేస్తున్న కొద్దీ ఐఫోన్ 15 ప్రోకు ఎక్కువ నష్టం జరిగింది. ఐఫోన్ 14 ప్రో మాత్రం పని చేస్తూనే ఉంది. ఆ డ్రాప్ టెస్ట్‌లో ఐఫోన్ 15 ప్రోకు ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఆ తర్వాత సామ్ ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro), ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లకు స్క్రాచ్ టెస్టింగ్, హీటింగ్ టెస్టింగ్, శాండ్‌పేపర్ టెస్ట్ చేశాడు.

Viral News: 5 ఏళ్ల క్రితం పెళ్లి కాకముందు నా భర్త పంపిన మెసేజ్ ఇదేనంటూ ఓ భార్య బయటపెట్టిన సీక్రెట్.. నెట్టింట బిగ్ డిబేట్..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``నిజం చెప్పాలంటే ఎంతటి ఫోన్ అయిన అన్ని సార్లు కింద పడేస్తే పగిలిపోతుంది``, ``ఐఫోన్ 15 బ్యాక్ గ్లాస్ అంత త్వరగా పగిలిపోతుందని నేను ఊహించలేదు``, ``డ్రాప్ టెస్ట్ బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-26T15:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising