ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

WhatsApp: మీ వాట్సాప్‌ను వేరే వాళ్లు ఎవరైనా ఉపయోగిస్తున్నారా..? ఇంకెక్కడయినా లాగిన్ అయి ఉందా..? ఎలా తెలుసుకోవచ్చంటే..!

ABN, First Publish Date - 2023-10-18T16:32:26+05:30

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాట్సాప్‌ను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది దైనందిన జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగంగా మారిపోయింది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను చాలా మంది వాట్సాప్ ద్వారానే చక్కబెడుతున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లను (Smart Phones) వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాట్సాప్‌ను (WhatsApp) ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది దైనందిన జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగంగా మారిపోయింది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను చాలా మంది వాట్సాప్ ద్వారానే చక్కబెడుతున్నారు. వాట్సాప్ సహాయంతో ఫోటోలు, వీడియోలు పంపడం చాలా ఈజీ అయిపోయింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు (Cyber Crimes) కూడా పెరిగిపోతున్నాయి.

మన ఫోన్‌ను హ్యాక్ చేసి మన వాట్సాప్‌పై (Hacking Whatsapp) వేరెవరైనా కన్నేసే ప్రమాదం కూడా ఉంది. వాట్సాప్ ద్వారా మనం ఏం చేస్తున్నామని వేరొకరు చూస్తున్నారేమో అనే ఆందోళన చాలా మందికి ఉంటుంది. అయితే అలాంటి ఆందోళన అక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న ఒక ఫీచర్ ద్వారా మీ ఖాతా ఎప్పుడు, ఎక్కడ లాగిన్ అయిందో సులభంగా తెలుసుకోవచ్చు. వాట్సాప్‌లో ఉండే ఆ ఫీచర్ పేరు ``లింక్ డివైజ్`` (Link Device). దాని సహాయంతో మీ ఖాతా ఎక్కడెక్కడ లాగిన్ (Log in) అయి ఉందో మీరు చూడవచ్చు.

Israel-Hamas War: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ఎఫెక్ట్.. టీవీ నుంచి వాషింగ్ మెషీన్ల వరకు.. వేటి ధరలు పెరగబోతున్నాయంటే..!

ముందుగా వాట్సాప్‌ ఓపెన్ చేసి, సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే లింక్ డివైజ్` ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ ఆప్షన్ ఎంచుకోగానే మీ వాట్సాప్ ఖాతా ఎక్కడెక్కడ లాగిన్ అయితే ఉందో చూపిస్తుంది. మీరు ఉపయోగించకపోయినట్టైతే కింద ఉండే ``లాగ్ అవుట్`` (Log Out) ఆప్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. మీరు ఉపయోగిస్తున్న డివైజ్‌లో తప్ప మిగిలిన అన్ని డివైజ్‌లలోనూ మీ వాట్సాప్ ఖాతా లాగ్ అవుట్ అయిపోతుంది.

Updated Date - 2023-10-18T16:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising