ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

jallikattu: జల్లికట్టుకు అనుమతి కోరుతూ ఎద్దులతో యువకులు చేసిన పనేంటో తెలుసా..

ABN, First Publish Date - 2023-05-09T07:55:16+05:30

తమ గ్రామంలో జల్లికట్టు(jallikattu)కు అనుమతి కోరుతూ ఎద్దులతో యువకులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): నామక్కల్‌ సమీపంలో అలంగానత్తం గ్రామంలో జల్లికట్టు(jallikattu)కు అనుమతి కోరుతూ ఎద్దులతో యువకులు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. అలంగానత్తంలో ప్రతి ఏడాది పొంగల్‌ పండుగ సందర్భంగా జల్లికట్టు పోటీలు నిర్వహించేవారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా 2020 నుంచి ఈ గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అనుమతించలేదు. ఈ నేపథ్యంలో రెడ్డిపట్టి, కలశపాళయం, ఎరుంబపట్టి, అలంగానత్తం తదితర గ్రామాలకు చెందిన సుమారు 50 మందికి పైగా యువకులు తాము పెంచుకుంటున్న జల్లికట్టు ఎద్దులతో అలంగానత్తం జంక్షన్‌లో ఉదయం 10.30 గంటలకు ఆందోళనలో పాల్గొన్నారు అందువల్ల ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న ఏఎస్పీ సురేష్‌, సేందమంగళం తహసీల్దార్‌ సెంథిల్‌కుమార్‌ జల్లికట్టు నిర్వాహక కమిటీ సభ్యులతో చర్చలు జరిపి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించి వెనుదిరిగారు.

Updated Date - 2023-05-09T07:55:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising