Janhvi Kapoor: ‘ఎన్టీఆర్ 30’ లో హీరోయిన్ పాత్రకు భారీ రెమ్యునరేషన్!
ABN, First Publish Date - 2023-02-22T16:00:22+05:30
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, గుడ్ లక్ జెర్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’, గుడ్ లక్ జెర్రి వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. చివరగా ‘మిలీ’ (Mili) లో కనిపించింది. ఈ మూవీలో ఆమె నటనకు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. జాన్వీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్ 30’ (NTR 30) లో హీరోయిన్ పాత్రను పోషించనుంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సరసన నటించనుంది. ఈ చిత్రం చేసేందుకు ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకొనుందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
‘ఎన్టీఆర్ 30’ లో నటించేందుకు జాన్వీ కపూర్ రూ.4కోట్లను పారితోషికంగా అందుకొనుందట. బాలీవుడ్లో అనేక సినిమాలు చేసి ఆమె పాపులారిటీ బాగా సంపాదించుకుంది. అందువల్ల మేకర్స్ అంత రెమ్యునరేషన్ చెల్లించేందుకు అంగీకరించారని సమాచారం. సమంత, నయనతార వంటి హీరోయిన్స్ ఒక్కో చిత్రానికి రూ. 5కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. వారితో పోలిస్తే జాన్వీ కపూర్ తీసుకుంటుంది తక్కువే అయినప్పటికీ అది భారీ మొత్తం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ‘ఎన్టీఆర్ 30’ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియాగా నిర్మిస్తుంది. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్ టైనర్గా పోర్ట్ బ్యాక్డ్రాప్లో రూపొందనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మార్చి 20 తర్వాత ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Updated Date - 2023-02-22T16:01:12+05:30 IST