River Turns Blood Red: ఉన్నట్టుండి..ఓడరేవులో నీరు రక్తంలా ఎర్రగా మారడంతో స్థానికులు, పర్యాటకులు ఆందోళన .. ఏం జరిగిందా అని ఆరా తీస్తే..
ABN, First Publish Date - 2023-06-29T17:22:56+05:30
ఉన్నట్టుండి.. ఆ ఓడరేవు ప్రాంతమంతా రక్తం పారినట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారింది. విషయం ఏంటో తెలియక స్థానికులు స్థానికులు, యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. విషయమేంటంటే.. జపాన్‌లోని ఓ ఓడరేవు సమీపంలో సముద్రపు నీరు ఎరుపుగా మారిన దృశ్యాల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఎందుకు ఆ సముద్రంలోని నీరు రక్తం రంగులోకి మారింది.. ఆ ఓడరేవు దగ్గర ఏం జరిగిందో తెలుసుకుందాం..
ఉన్నట్టుండి.. ఆ ఓడరేవు ప్రాంతమంతా రక్తం పారినట్టు మొత్తం ఎరుపు రంగులోకి మారింది. విషయం ఏంటో తెలియక స్థానికులు స్థానికులు, యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. విషయమేంటంటే.. జపాన్‌లోని(Japan) ఓ ఓడరేవు సమీపంలో సముద్రపు నీరు ఎరుపుగా మారిన దృశ్యాల వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అసలు ఎందుకు ఆ సముద్రంలోని నీరు రక్తం రంగులోకి మారింది.. ఆ ఓడరేవు దగ్గర ఏం జరిగిందో తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే.. జపాన్‌లోని నాగో సిటీ ( Nago City) సమీపంలో ఓడరేవు ఉంది. ఉన్నట్టుంది ఓడరేవు సమీపంలో సముద్రపు నీరంతా ఎర్రగా రక్తంలా మారింది. దీంతో స్థానికులు, సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. ఇలా మారడానికి కారణమేంటనీ ఓడరేవు సిబ్బంది ఆరా తీయగా.. పక్కనే ఉన్న ఓ బీర్ల కంపెనీ నుంచి వచ్చే రసాయనాలు కారణమని తేలింది.
బీబీసీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం బ్రూవరీ(Brewery) కంపెనీ అనే బీర్ కంపెనీలోని శీతలీకరణ వ్యవస్థనుంచి ఫుడ్ కలరింగ్ (Food Colouring Leak)రసాయనాలు లీక్ అయ్యాయి. ఫుడ్ కలరింగ్‌తో సముద్రం నీరు ఎరుపు రంగులోకి మారింది. అయితే ఎలాంటి హానీ ఉండదని బ్రూవరీ కంపెనీ ప్రకటించినట్లు బీబీసీ తెలిపింది. కంపెనీ యాజమాన్యం ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారట.
‘‘మా ఫ్యాక్టరీ నుంచి శీతలీకరణ సందర్భంలో ప్రొపైలిన్ గ్లైకాల్ లీకేజీ కావడం.. వర్షం నీరు ద్వారా ఇది సముద్రంలో కలిసిపోయి నీరు ఎరుపుగా మారిందని ఓవరీస్ బ్రూవరీ తెలిపారు. ఏదేమైనప్పటికీ స్థానికులను ఆందోళనకు గురిచేసిన ఈ సంఘటనతో ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది.
Updated Date - 2023-06-29T17:35:20+05:30 IST