ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Instagram: భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.. భర్త అకౌంట్ బ్లాక్.. అనుమానంతో ఆ వ్యక్తి ఏం చేశాడంటే..

ABN, First Publish Date - 2023-08-15T10:30:30+05:30

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. కాస్త ఖాళీ దొరికితే చాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లోనే సమయం గడుపుతున్నారు. మరికొందరు మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి వాటికే అంకితమైపోతున్నారు. అలా రోజంతా ఇన్‌స్టాగ్రామ్ చూస్తే గడిపేస్తున్న భార్యపై ఓ వ్యక్తి అనుమానం పెంచుకున్నాడు.

ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) యుగం నడుస్తోంది. కాస్త ఖాళీ దొరికితే చాలు ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వంటి సామాజిక మాధ్యమాల్లోనే సమయం గడుపుతున్నారు. మరికొందరు మిగతా పనులన్నింటినీ పక్కన పెట్టి వాటికే అంకితమైపోతున్నారు. అలా రోజంతా ఇన్‌స్టాగ్రామ్ చూస్తే గడిపేస్తున్న భార్య (Wife)పై ఓ వ్యక్తి అనుమానం పెంచుకున్నాడు. ఎంతకీ ఆమె తీరు మారకపోవడంతో గొంతు నులిమి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో ఈ దారుణం వెలుగు చూసింది (Crime News).

లఖ్‌నవూ (Lucknow)లోని పారా ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల ఓ వ్యాపారవేత్తకు 12 ఏళ్ల కూతురు, 5 ఏళ్ల కొడుకు ఉన్నారు. గ‌ృహిణి అయిన అతడి భార్యకు ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రోజంతా ఇన్‌స్టాగ్రామ్ చూస్తూనే గడిపేసే ఆమెకు భారీగా ఫాలోవర్లు (Instagram Followers) ఉన్నారు. మరో వైపు ఆమె తన భర్త (Husband) అకౌంట్‌ను బ్లాక్ చేసింది. దీంతో భర్తకు భార్యపై అనుమానం మొదలైంది. భార్యకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్‌తో ఎఫైర్ ఉందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై భార్యతో చాలా సార్లు గొడవపడ్డాడు.

Love: గొప్ప ప్రేమికురాలు.. ప్రియుడి కోసం ఏకంగా రూ.2 వేల కోట్ల ఆస్తిని వదులుకుంది.. చివరకు..

ఆదివారం ఉదయం భార్య, పిల్లలను తీసుకుని కారులో రాయ్‌బరేలీకి బయల్దేరాడు. మార్గమధ్యంలో మళ్లీ వారి మధ్య ఇన్‌స్టాగ్రామ్ విషయమై వాగ్వాదం చెలరేగింది. కారు ఆపేసి మరీ ఇద్దరూ గొడవపడ్డారు. తీవ్ర ఆగ్రహానికి గురైన వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేశాడు (Husband killed wife). ఆ ఘటన చూసి పిల్లలు షాకయ్యారు. తర్వాత కారులో మృతదేహాన్ని పేడేసి కారు లాక్ చేసుకుని అక్కడే ఉండిపోయాడు. పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చెక్ చేయడంతో అసలు విషయం బయటపడింది. అమ్మను నాన్న చంపేశాడని పోలీసులకు పిల్లలు చెప్పారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

Updated Date - 2023-08-15T10:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising