ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Richest Woman: ఈ ఏడాది అత్యధిక సంపాదన ఆమెదే.. ఏకంగా అంబానీనే దాటేసిందిగా..

ABN, Publish Date - Dec 19 , 2023 | 09:26 PM

దేశంలో అత్యధిక ధనవంతులు ఎవరు అని అడిగితే.. టక్కున అంబానీ, ఆదానీ.. అని అంటాం. కానీ ఈ ఏడాది ఓ మహిళ వారికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 2023 ఏడాదికి గానూ ఓ మహిళ అంబానీ, ఆదానీ సంపదను దాటి పోయింది. ఈ ఏడాదిలో...

దేశంలో అత్యధిక ధనవంతులు ఎవరు అని అడిగితే.. టక్కున అంబానీ, ఆదానీ.. అని అంటాం. కానీ ఈ ఏడాది ఓ మహిళ వారికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. 2023 ఏడాదికి గానూ ఓ మహిళ అంబానీ, ఆదానీ సంపదను దాటి పోయింది. ఈ ఏడాదిలో అంబానీ ఆదాయం 5.2 బిలియన్ డాలర్లు కాగా.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ సందప 9.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ మేరక బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వివరాలు వెళ్లడించింది. వివరాల్లోకి వెళితే..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. 2023 ఏడాది అత్యధిక సంపదను ఆర్జించిన జాబితాలో జిందాల్ గ్రూప్ (Jindal Group) వ్యవస్థాపకులు ఓంప్రకాశ్ జిందాల్ సతీమణి సావిత్రి జిందాల్ (Savitri Jindal) అగ్రస్థానంలో నిలిచారు. ఈమె మొత్తం సంపాదన రూ.2.10 లక్షలు కాగా, ఒక్క ఈ ఏడాదే ఆమె సంపాదన రూ.80 వేల కోట్లు పెరిగింది. ఓం ప్రకాశ్ మరణానంతరం సావిత్రి జిందాల్.. ఈ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. జేఎస్‪‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‪‌డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టెయిన్‌లెస్ తదితర కంపెనీలు ఈ గ్రూపులో ఉన్నాయి. దేశంలోని కుబేరుల స్థానంలో 5వ స్థానంలో నిలిచిన సావిత్రి జిందాల్.. ఉప ఖండంలోని మహిళా సంపన్నుల జాబితాలో (Rich Women List ) మాత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్లో జిందాల్ గ్రూప్ కంపెనీల షేర్లు అత్యధిక లాభాను ఆర్జించాయి. దీంతో సావిత్రి జిందాల్ సంపద ఒక్కసారిగా పెరిగింది.

Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

దేశంలోని సంపన్నుల జాబితాలో హెచ్‌సీఎల్ టెక్ అధినేత శివ్‌నాడర్ 8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద ప్రస్తుతం రూ.66.5 వేల కోట్లకు చేరుకుంది. అదేవిధంగా మూడో స్థానంలో రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్ లిమిటెడ్ ఛైర్మన్ కేపీ సింగ్ నిలిచారు. ఈయన ఆదాయం రూ.59.47 వేల కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఈయన సంపద 7.15 బిలియన్ డాలర్లు పెరిగింది. అదేవిధంగా తరువాతి స్థానాల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ బిర్లా, షాపూర్ మిస్త్రీ ఉన్నారు. ఇక రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్ డాలర్లు మాత్రమే పెరిగింది. అయితే ప్రపంచ కుబేరుల్లో అంబానీ 13వ స్థానంలో ఉండగా.. దేశంలో తొలి స్థానంలోనే కొనసాగుతున్నారు. మరోవైపు ఆదానీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు.

Viral Video: పెట్రోల్ బంక్‌‌లో విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. పెట్రోలు పట్టే క్రమంలో సిబ్బంది చేసిన నిర్వాకం..

Updated Date - Dec 19 , 2023 | 09:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising