JOBS: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే కబురు.. 15ఏళ్ళ వయసుకే ఉద్యోగావకాశం..
ABN, First Publish Date - 2023-01-22T12:39:45+05:30
ఉద్యోగాల అర్హత కూడా 18 ఏళ్ళు అని ప్రతిచోట మెన్షన్ చేస్తున్నారు. కానీ 15సంవత్సరాల వయసుకే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పుడు..
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయనివారుండరు. కానీ ప్రభుత్వ ఉద్యోగం సొంతమయ్యేసరికి వ్యక్తి సగటు వయసు కనీసం 25 నుండి 30 సంవత్సరాలు ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత కూడా 18 ఏళ్ళు అని ప్రతిచోట మెన్షన్ చేస్తున్నారు. కానీ 15సంవత్సరాల వయసుకే ప్రభుత్వ ఉద్యోగం వస్తే.. ఎవరిస్తారు 15ఏళ్ళకే అని అందరూ అనుకుంటారు. అయితే15 ఏళ్ళ వయసుకే ఉద్యోదం సంపాదించే అవకాశం అందరికోసం ఎదురుచూస్తోంది.
సాధారణంగా రైల్వే ఉద్యోగాలకు విద్యార్హత 10వ తరగతి పూర్తై ఉంటే చాలని అంటూ ఉంటారు. కానీ 18ఏళ్ళు నిండి ఉండాలనే షరతు పెట్టేవారు. అయితే ఇప్పడు 10వ తరగతి పాసైన ఫ్రెషర్స్ ఉద్యోగ ప్రయత్నాలు చేసి హాయిగా చిన్న వయసులో సెటిల్ అవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో 10వ తరగతి పాసైన 15 సంవత్సరాల వారు అర్హులేనని ప్రటించింది. అందులో ఎంపిక అయితే 25వేల రూపాయల వేతనం లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఇంటర్ అర్హతతో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్ ఉద్యోగావకాశాలు, బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ లోsc-st కేటగిరీ వారికి ఉచితంగా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. మరిన్ని వివరాలకు సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ ను చూడండి.
Updated Date - 2023-01-22T14:28:33+05:30 IST