Kangana Ranaut Warning: ఆయన సమగ్రతను ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం!

ABN, First Publish Date - 2023-02-18T17:54:42+05:30

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ దర్శకధీరుడు రాజమౌళికి సపోర్ట్‌గా వరుస ట్వీట్స్‌ చేశారు. రాజమౌళిని టార్గెట్‌ చేసుకోవద్దని రైట్‌ వింగ్‌ హితవు పలికిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల పట్ల రాజమౌళిని టార్గెట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైట్‌ వింగ్‌కు కంగనా వార్నింగ్‌ ఇచ్చింది.

Kangana Ranaut Warning: ఆయన సమగ్రతను ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ (kangana Ranauth) దర్శకధీరుడు రాజమౌళికి (raja mouli) సపోర్ట్‌గా వరుస ట్వీట్స్‌ చేశారు. రాజమౌళిని టార్గెట్‌ చేసుకోవద్దని రైట్‌ వింగ్‌ (Right wing) హితవు పలికిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల పట్ల రాజమౌళిని టార్గెట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైట్‌ వింగ్‌కు కంగనా వార్నింగ్‌ ఇచ్చింది. వరుస ట్వీట్లు చేశారామె! ‘‘దీనిపై అతిగా స్పందించాల్సిన పని లేదు. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. కళాకారులకు ప్రత్యేకించి రైట్‌ వింగ్‌ సపోర్ట్‌ ఉండదు. మేధావి, జాతీయవాది అయిన రాజమౌళి సర్‌ని వ్యతిరేకంగా దేన్నీ నేను సహించను. వర్షంలో వెలిగే అగ్నికణంలాంటి వ్యక్తి ఆయన. రాజమౌళి ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఒక ప్రాంతీయ సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. అలాంటి వ్యక్తి మనకు ఉన్నందుకు గర్వించాలి. ఆయన దేశం పట్ల అంకితభావం కలిగి ఉన్నారు. ఈ జాతి వ్యక్తిగా రాజమౌళి సమగ్రతను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం’ అంటూ ట్విటర్‌లో ప్రశ్నించారు. రాజమౌళిపై ది న్యూ యార్కర్‌లో వచ్చిన కథనంపై కంగనా తీవ్రంగా స్పందించారు.

‘ప్రపంచం ఆయనపై వివాస్పదమైన ముద్ర ఎందుకు వేసింది? ఆయన చేసిన వివాదం ఏమిటి? మన నాగరికతను కీర్తించడానికి బాహుబలి (bahubali)అనే సినిమా తీసినందుకా? లేక మన జాతి గర్వించేలా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)సినిమాని తీశాడనా? ఇంటర్‌నేషనల్‌ రెడ్‌ కార్పెట్‌ మన ధోతీ ధరించాడనా? ఆయన చేసిన తప్పేంటి సూటిగా చెప్పండి అని నిలదీశారు.

Updated Date - 2023-02-18T18:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising