Katpadi Railway Station: ఆ మహిళకు మనసెలా ఒప్పిందో....!

ABN, First Publish Date - 2023-05-05T08:26:47+05:30

రైల్వేస్టేషన్‌(Katpadi Railway Station)లో ఓ మహిళ వదిలివెళ్లిన ఆరు నెలల శిశువును రైల్వే పోలీసులు పిల్లల భద్రతా హోంకు అప్పగించారు.

Katpadi Railway Station: ఆ మహిళకు మనసెలా ఒప్పిందో....!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై): కాట్పాడి రైల్వేస్టేషన్‌(Katpadi Railway Station)లో ఓ మహిళ వదిలివెళ్లిన ఆరు నెలల శిశువును రైల్వే పోలీసులు పిల్లల భద్రతా హోంకు అప్పగించారు. సేలం జిల్లాకు చెందిన సుందరి (63) గురువారం కాట్పాడి రైల్వేస్టేషన్‌లోని 6వ నెంబరు ఫ్లాట్‌ఫారంపై రైలు కోసం వేచి ఉండగా, శిశువుతో ఓ మహిళ ఆమె వద్దకు వచ్చింది. ఐదు నిమిషాలు శిశువును చూడమని సుందరికి అప్పగించిన ఆ మహిళ వెళ్లి ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో గాభరా పడిన సుందరి(Sundari) రైల్వేపోలీసులకు సమాచారం అందించింది. స్టేషన్‌లోని సీసీ ఫుటేజి పరిశీలించగా, సుందరికి బిడ్డను అప్పగించిన మహిళ స్టేషన్‌ బయట ఇద్దరు పిల్లలతో వేచి ఉన్న ఓ వ్యక్తితో కలసి ఆటోలో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో, ఆ మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు, శిశువును కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలోని పిల్లల భద్రత హోంకు తరలించారు.

Updated Date - 2023-05-05T08:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising