ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఈ రైతు సామాన్యుడు కాదు.. ఆడీ కారులో వచ్చి ఆకుకూరలు అమ్ముతున్నాడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే!

ABN, First Publish Date - 2023-10-01T10:25:56+05:30

సాధారణంగా రైతులు పంట పండించేందుకు ఎంత ఇబ్బంది పడతారో, వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి సరైన ధరకు విక్రయించేందుకు మరిన్ని కష్టాలు పడతారు. వారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడో కాని దక్కదు. అప్పు ఊబిలో చిక్కుకుని ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం.

సాధారణంగా రైతులు (Farmers) పంట పండించేందుకు ఎంత ఇబ్బంది పడతారో, వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లి సరైన ధరకు విక్రయించేందుకు మరిన్ని కష్టాలు పడతారు. వారి శ్రమకు తగ్గ ఫలితం ఎప్పుడో కాని దక్కదు. అప్పు ఊబిలో చిక్కుకుని ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూశాం. అయితే అందరి రైతుల్లా కాకుండా కేరళకు చెందిన ఓ రైతు (Kerala Farmer) మాత్రం వ్యవసాయాన్ని (Agriculture) లాభసాటిగా మార్చాడు. ఏకంగా ఆడీ కారులో మార్కెట్‌కు వెళ్లి తన ఉత్పత్తులను అమ్ముతున్నాడు.

వ్యవసాయానికి విభిన్నతను, టెక్నాలజీని జోడించి అద్భుత ఫలితాలు సాధిస్తున్న సుజిత్ అనే రైతు కేరళలో చాలా పాపులర్. అతడి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ variety_farmerకు చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా సుజిత్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video)లో సుజిత్ ఆడీ కారులో ఓ రోడ్డు సైడ్ మార్కెట్‌కు వచ్చాడు (Kerala Farmer Arrives In Audi A4). స్టైల్‌గా కారు దిగి, కట్టుకున్న పంచె, బూట్లు విప్పి కారులో పడేశాడు. అనంతరం రోడ్డు పక్కన ఓ చాప పరుచుకుని అందులో ఆకు కూరలు వేసి అమ్మడం ప్రారంభించాడు.

Health: తరచుగా షాంపూతో తలస్నానం చేస్తుంటారా? ఏడేళ్లుగా షాంపూ వాడని వ్యక్తి జట్టు ఎలా అయిందంటే..

ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వరకు వీక్షించారు. సుజిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ``నిజాయితీగా కష్టపడితే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమే``, ``కొత్తగా ఆలోచించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు``, ``ఆ ఆడీ కారు వెనుక అతడి నిజాయితీ, కష్టం ఉన్నాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో వీడియోలను సుజిత్ తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఆ వీడియోలు చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతుంటారు.

Updated Date - 2023-10-01T10:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising