Kiara adwani - manish malhotra: జైసల్మీర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌!

ABN, First Publish Date - 2023-02-04T14:39:17+05:30

కథానాయిక కియారా అడ్వాణీ పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్‌- జైసల్మీర్‌లోని సూర్యఘర్‌ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది.

Kiara adwani - manish malhotra: జైసల్మీర్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani) పెళ్లి పనులు షురూ అయ్యాయి. ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్ర(manish malhotra)ను ఆమె పెళ్లాడనుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈ నెల 6న వివాహబంధంతో ఒకటి కానున్నారు. రాజస్థాన్‌- జైసల్మీర్‌లోని (Jaisalmer) సూర్యఘర్‌ ప్యాలెస్‌లో ఈ వివాహానికి వేదిక కానుంది. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. కియారా అడ్వాణీ, తన కుటుంబ సభ్యులు, మనీష్‌ జైసల్మీర్‌ ప్యాలెస్‌కి చేరుకున్నారు. దీనికి సంబంధించి ఎయిర్‌పోర్ట్‌లోని ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ నెల ఐదో తేదీన మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలు ప్లాన్‌ చేశారని, 6న మనీష్‌-కియారా వివాహబంధంతో ఒకటి కానున్నారనీ తెలుస్తోంది. ఏడో తేదీన గ్రాండ్‌గా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. మనీష్‌ మల్హోత్ర, కియారా చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే ఎక్కడ ప్రేమ విషయాన్ని బయటకు రానివ్వలేదు. ఇప్పుడు వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటై కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. బాలీవుడ్‌ నుంచి సినీ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరు కానున్నారని, టాలీవుడ్‌నుంచి రామ్‌చరణ్‌ (Ram charan)ఈ పెళ్లికి వెళ్లబోతున్నారని తెలిసింది. (Destination wedding)

1.jpg

‘ఫగ్లీ’ చిత్రంతో నటిగా కెరీర్‌ ప్రారంభించిన కియారా, ‘ఎం.ఎస్‌ ధోని’ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైంది. ‘భరత్‌ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ సరసన ఆర్‌సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి శంకర్‌ దర్శకుడు.

Updated Date - 2023-02-04T14:41:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising