ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: బాబోయ్.. ఈ పిల్లాడి పట్టుదల మామూలుగా లేదుగా.. తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కాడు..!

ABN, First Publish Date - 2023-04-13T14:55:53+05:30

అమ్మ మీద కోపంతో పదకొండేళ్ల బాలుడు ఏకంగా సైకిల్ తొక్కుకుంటూ 130 కిలోమీటర్లు (travels 130 km) వెళ్లిపోయాడు. ఆ తర్వాత..

Viral News
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇంట్లో పిల్లలు అలగడం. చిన్న చిన్న విషయాలకే కోప్పడడం. చిరాకు పడడం చూస్తుంటాం. ఆ కోపాన్ని వస్తువుల మీదనో.. పేరెంట్స్ మీదనో చూపిస్తుంటారు. ప్రతీ ఇంట్లో ఇలా జరుగుతుంటాయి. కొంత మంది ఇంట్లో నుంచీ పారిపోతుంటారు. మరికొందరు అలకపాన్పు ఎక్కుతుంటారు. తెలిసీతెలియని వయసులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలంటారు పెద్దలు.

సహజంగా పిల్లలకు కోపం రప్పించకూడదంటారు. ఓ వైపు స్కూల్‌కు సంబంధించిన పనులు. ఇంకో వైపు ఇంట్లో పనులు. దీంతో పిల్లలు ఒత్తిడికి గురవుతుంటారు. ఈ పరిస్థితుల్లో వారు అసహనానికి లోనవుతుంటారు. కొంత మంది మొండిగా తయారవుతుంటారు. ఇదంతా ఎందుకంటారా? అమ్మ మీద కోపంతో పదకొండేళ్ల బాలుడు ఏకంగా సైకిల్ తొక్కుకుంటూ 130 కిలోమీటర్లు (travels 130 km) వెళ్లిపోయాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

ఓ బాలుడు (kid angry) తన తల్లితో (mother) గొడవ పడ్డాడు. మనస్తాపానికి గురైన బాలుడు అమ్మ మీద ఫిర్యాదు (complain) చేయాలని డిసైడ్ అయ్యాడు. అంతే మిజియాంగ్‌లో ఉంటున్న తన అమ్మమ్మ (grandmother) ఇంటికి సైకిల్ (cycle) మీద బయల్దేరాడు. గతంలో గుర్తుపెట్టుకున్న గుర్తుల ఆధారంగా రహదారిపై వెళ్తూనే ఉన్నాడు. మధ్య మధ్యలో ఇంట్లో నుంచీ తెచ్చుకున్న బ్రెడ్, మంచినీళ్లతో కడుపు నింపుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా వెళ్తున్న క్రమంలో దారి తప్పి ఏకంగా 130 కిలోమీటర్లు వెళ్లిపోయాడు. వాస్తవానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లాలంటే గంట సమయం సరిపోతుంది. కానీ దారి తప్పడంతో తెలియకుండానే 130 కిలోమీటర్లు ప్రయాణం చేసేశాడు.

130 కిలోమీటర్లు సైకిల్ తొక్కినా అమ్మమ్మ ఇల్లు రాకపోవడం... పైగా ఒకరోజ గడిచిపోవడం.. ఇంకోవైపు అలసిపోవడంతో ఓ చోట ఆగి ఒంటరిగా కూర్చున్నాడు. బాలుడిని చూసి స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. 130 కిలోమీటర్లు సైకిల్ తొక్కి.. తొక్కి నీరసించి పోయాడు. దీంతో బాలుడు కనీసం నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. పోలీసులు కారులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాలుడి అమ్మమ్మను, తల్లిని రప్పించి అప్పగించారు. కోపంలో అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోమని బెదిరించినట్లు బాలుడి తల్లి తెలిపింది. నిజంగానే అలా చేస్తాడని ఊహించలేదని ఆమె పేర్కొంది.

ఇది కూడా చదవండి: Viral News: ఏంటీ.. ఓడలాంటి ఇల్లు కావాలా..? కూలోళ్లకు ఇవ్వడానికైనా డబ్బులున్నాయా..? అని ఇంజనీర్లే హేళన చేశారు.. చివరకు..!

ఇది కూడా చదవండి: Lottery: లాటరీలో గెలిచింది రూ.328 కోట్లు.. కానీ అతడికి వచ్చింది మాత్రం కేవలం రూ.174 కోట్లే.. ఇంత తేడా ఎందుకంటే..!

ఇది కూడా చదవండి: Viral Video: వారెవ్వా.. ఏం ట్రైనింగ్ ఇచ్చావు బాసూ.. కుర్రాడితో బ్యాట్మింటన్ ఆడుకుంటున్న మూడు పిల్లులు..!

ఇది కూడా చదవండి: అన్నీ మర్చిపోదాం.. ఇంటికి రండని పిలిస్తే.. ప్రేమ పెళ్లయిన 4 ఏళ్లకు భార్యతో సహా ఇంటికి వెళ్లాడా భర్త.. 10 రోజుల తర్వాత..

Updated Date - 2023-04-13T14:55:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising