ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kidney Cleansing Vegetables: ఎక్కడ చూసినా కిడ్నీ సమస్యలతో ఆస్పత్రి పాలవుతున్న వాళ్లే.. అసలీ రోగానికే చెక్ పెట్టాలంటే..!

ABN, First Publish Date - 2023-09-19T11:44:28+05:30

ప్రతిరోజు సగటున 200లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడగడతాయి. ఇవి ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. ఇవి ఏ మాత్రం దెబ్బతిన్నా ఇక ప్రమాదంలోకి జారుకున్నట్టే..

మనిషి శరీరంలో మూత్రపిండాలు చాలా ప్రధానమైనవి. రక్తంలో ఉన్న నీటిని, టాక్సిన్ లను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేస్తుంటాయి. ప్రతిరోజు సగటున 200లీటర్ల రక్తాన్ని మూత్రపిండాలు వడగడతాయి. ఇవి ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. కానీ ఈమధ్యకాలంలో మూత్రపిండ పనితీరులో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారు అధికంగా ఉన్నారు. మూత్రపిండాలలో రాళ్ళు, కడుపునొప్పి, అలసట, తలనొప్పి, శరీరం వాపు మొదలైన ఎన్నో సమస్యలు మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల వస్తాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కాలేయం పనితీరు కూడా దెబ్బతింటుంది. మూత్రపిండాలను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ కింది 5 కూరగాయలు(Kidney cleansing Vegetables) తీసుకోవాలి..

క్యాప్సికమ్.. లేదా బెల్ పెప్పర్..(capsicum or bell pepper)

క్యాప్సికమ్ లేదా బెల్ పెప్పర్ మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రపిండాలను శుభ్రం చేస్తుంది. ఇంకా క్యాప్సికంలో కిడ్నీ ప్రమాదాలనుండి కాపాడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

బచ్చలికూర..(spinach)

మూత్రపిండాల ఆరోగ్యానికి బచ్చలికూర చాలామంచిది. ఇందులో ఫైబర్, ఫోలేట్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. బచ్చలికూర తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ది అవుతుంది. ఈ కారణంగా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది.

Marriage Tips: అమ్మాయిలూ.. పెళ్లి చూపుల్లోనే అబ్బాయిని ఈ ప్రశ్న అడిగేయండి.. ఇలా చెప్పినోళ్లనే పెళ్లాడండి..!



క్యారెట్..(carrot)

క్యారెట్లు కేవలం కంటిచూపుకే కాదు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇందుసో ఉండే విటమిన్-ఎ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్లు తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాల సామర్థ్యాన్ని పెంచుతాయి.

టమోటాలు..(tomato)

టమోటాలలో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాసిడ్ లను నియంత్రిస్తుంది.

రెడ్ పెప్పర్..(red pepper)

ఎరుపు రంగులో ఉండే క్యాప్సికం, లావుగా ఉండే ఎర్ర మిరపకాయలు మూత్రపిండాల వ్యాధిలో బాగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్-సి, ఫోలెట్, విటమిన్-బి6, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి సహజ యాంటీఆక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే.. ఇది శరీరంలో రక్తప్రసరణ పెంచడంలోనూ, జీవక్రియను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. రెడ్ పెప్పర్ లో ఉండే లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మూత్రపిండాలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి నుండి కాపాడతాయి.

Viral: రూ.6 కోట్ల విలువైన ఈ ఇంటిని.. కేవలం రూ.100 కే అమ్మేస్తున్నారంటే నమ్మలేరు కదూ.. నిజమండీ బాబోయ్.. ఎక్కడంటే..!


Updated Date - 2023-09-19T11:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising