Library: రూ.114 కోట్లతో కలైంజర్ గ్రంథాలయం
ABN, First Publish Date - 2023-06-27T11:18:18+05:30
ఆలయాల నగరం మదురైలో రూ.99 కోట్లతో నిర్మించిన కలైంజర్ గ్రంథాలయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ జూలై 15న ప్రారంభించను
ప్యారీస్(చెన్నై): ఆలయాల నగరం మదురైలో రూ.99 కోట్లతో నిర్మించిన కలైంజర్ గ్రంథాలయాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ జూలై 15న ప్రారంభించనున్నారు. ఈ గ్రంథాలయం కోసం రూ.10 కోట్ల విలువైన పుస్తకాలను కొనుగోలు చేశారు. మదురై పుదునత్తం రహదారిలో రూ.114 కోట్లతో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరుతో ఆధునిక వసతులతో గ్రంథాలయం నిర్మితమవుతోంది. అందులో భవన నిర్మాణానికి రూ.99 కోట్లు, పుస్తకాల కొనుగోలుకు రూ.10 కోట్లు, సాంకేతిక పరికరాల కొనుగోలుకు రూ.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2,13,288 చదరపు అడుదల విస్తీర్ణంలో 6 అంతస్తులతో నిర్మితమైన ఈ గ్రంథాలయానికి గత ఏడాది జనవరి 11న ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) శంకుస్థాపన చేశారు. కింది అంతస్తులో వాహనాలపార్కింగ్, దివ్యాంగులు సులువుగా కూర్చొని పుస్తక పఠనంచేసేలా 250 కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి అంతస్తులో చిన్నారుల గ్రంథాలయం ఏర్పాటవుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిని దృష్టిలో ఉంచుకొని 30 వేల పుస్తకాలు మూడో అంతస్తులో అందుబాటులో ఉంచనున్నారు.
Updated Date - 2023-06-27T11:18:18+05:30 IST