ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పునాదులు తవ్వుతోంటే బయటపడిన నంది విగ్రహం.. అనుమానంతో ఇంకాస్త లోతు తవ్వి చూస్తే..!

ABN, First Publish Date - 2023-11-20T18:41:02+05:30

మన దేశంలోని చాలా దేవాలయాలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ముఖ్యంగా దక్షిణాదిలోని చాలా పురాతన దేవాలయాలున్నాయి. ఎన్నో ఆలయాలు పాడుబడిపోయాయి. పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడుతుంటాయి. అలాంటి దేవాలయం ఒకటి కర్ణాటకలో 1997లో బయటపడింది.

మన దేశంలోని చాలా దేవాలయాలకు (Temples) వందల ఏళ్ల చరిత్ర ఉంది. ముఖ్యంగా దక్షిణాదిలోని చాలా పురాతన దేవాలయాలున్నాయి. ఎన్నో ఆలయాలు పాడుబడిపోయాయి. పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడుతుంటాయి. అలాంటి దేవాలయం ఒకటి కర్ణాటక (Karnataka)లో 1997లో బయటపడింది. బెంగళూరులోని శ్రీ దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి ప్రాంతంలో 400 ఏళ్ల క్రితం నాటి శివాలయం (400 year old temple) 1997లో వెలుగులోకి వచ్చింది. ఆ తవ్వకాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

religioussanatani అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. దక్షిణాముఖ నంది తీర్థ కళ్యాణి ప్రాంతంలో కొందరు కార్మికులు తవ్వినపుడు మొదటి వారికి ఓ నంది (Nandi) విగ్రహం కనిపించింది. ఆశ్చర్యపోయిన కార్మికులు మరింత లోతుకు తవ్వగా వారికి ఓ శివలింగం (Lord Shiva) కనిపించింది. ఆ తర్వాత తవ్వకాల్లో మొత్తం శివాలయం బయటపడింది. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. బెంగుళూరు నగరానికి వాయువ్య ప్రాంతంలో ఉన్న మల్లేశ్వరం లేఅవుట్‌లోని 2వ ఆలయ వీధిలో ఈ గుడి ఉంది. ఈ ఆలయాన్ని నంది తీర్థం, నందీశ్వర తీర్థం, బసవ తీర్థం, మల్లేశ్వరం నంది గుడి అని కూడా అంటారు.

Costliest Towel: ఈ టవల్ ఖరీదు ఏకంగా రూ.77 వేలు.. చిన్నదే కానీ ఎందుకంత రేటు అని ఆరా తీస్తే..!

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దాదాపు 6.4 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``ఇక్కడ చాలా శాంతి ఉంది, ఇది అద్భుతమైనది``, ``ఈ భూమి కింద మనకు తెలియనివి చాలా ఉన్నాయి`` అని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-20T18:41:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising