Helmet: మీరు బైక్‌కే హెల్మెట్ తగిలించి వదిలేస్తారా?.. అయితే జాగ్రత్త.. ఒక్కోసారి ఇలాంటి ప్రమాదాలు కూడా జరగొచ్చు..
ABN, First Publish Date - 2023-10-08T13:59:14+05:30
చాలా మంది ఇళ్ల ముందు లేదా ఆఫీస్‌ల ముందు బైక్‌లు పార్క్ చేసి హెల్మెట్ దానికే తగిలించి వెళ్లిపోతుంటారు. అలా చేయడం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటన తాజాగా కేరళలోని త్రిస్సూర్‌లో జరిగింది. ఈ ఘటన చాలా మందికి భయాందోళనలు కలిగిస్తోంది.
చాలా మంది ఇళ్ల ముందు లేదా ఆఫీస్‌ల ముందు బైక్‌లు (Bike) పార్క్ చేసి హెల్మెట్ (Helmet) దానికే తగిలించి వెళ్లిపోతుంటారు. అలా చేయడం ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో తెలియజేసే ఘటన తాజాగా కేరళ (Kerala)లోని త్రిస్సూర్‌లో జరిగింది. ఈ ఘటన చాలా మందికి భయాందోళనలు కలిగిస్తోంది. బైక్‌పై లాక్‌చేసి ఉంచిన హెల్మెట్‌లోకి ఏకంగా నాగుపాము (Snake) దూరింది. ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకునే ముందు ఒకసారి చూసుకున్నాడు కాబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు (Snake in Helmet).
త్రిస్సూర్‌లోని పుత్తూర్‌లో నివసించే సోజన్ అనే వ్యక్తి తన ఆఫీస్ దగ్గర బైక్ పార్క్ చేసి, దానికే హెల్మెట్ లాక్ చేసి వెళ్లిపోయాడు. ఆఫీసు అయిపోగానే ఇంటికి వెళ్లేందుకు బైక్‌ను తీస్తూ హెల్మెట్ పెట్టుకుందామని దానిని తీసాడు. అందులో ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి ఒకసారి మొత్తం పరిశీలించాడు. హెల్మెట్ లోపల పాము కనిపించింది. షాకైన సోజన్ వెంటనే హెల్మెట్‌ను దూరంగా విసిరేసి అటవీ అధికారులకు సమాచారం అందించాడు.
Viral Video: మీరు మంచూరియా తింటుంటారా? దానిని ఎలా తయారు చేస్తున్నారో చూస్తే భయపడతారేమో!
అక్కడికి చేరుకున్న లిజో అనే వ్యక్తి ఆ కోబ్రాను ఎంతో చాకచక్యంగా హెల్మెట్ నుంచి బయటకు తీశాడు. అనంతరం దాన్ని ఓ కవర్‌లో ఉంచి అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్, బూట్లు వేసుకునేముందు ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
Updated Date - 2023-10-08T13:59:14+05:30 IST