ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

NASA: నాసా విడుదల చేసిన షాకింగ్ ఫొటో.. ఫొటో తీసిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్.. ఆశ్చర్యపోతున్న సైంటిస్టులు..!

ABN, First Publish Date - 2023-11-21T19:25:50+05:30

ఈ విశాల విశ్వంలోని అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు తహతహలాడుతుంటాయి. అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ ``నాసా`` ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తాజాగా అత్యంత అరుదైన ఫొటో తీసింది.

ఈ విశాల విశ్వంలోని అంతరిక్ష (Space) రహస్యాలను తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కోట్ల కొద్దీ డబ్బు వెచ్చించి విశ్వ రహస్యాలను వెలికి తీసేందుకు తహతహలాడుతుంటాయి. అగ్రరాజ్యం అమెరికాకు (America) చెందిన అంతరిక్ష సంస్థ ``నాసా`` (NASA) ఇప్పటికే ఎన్నో నమ్మశక్యం కాని విశేషాలను వెల్లడించింది. నాసా ప్రయోగించిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (James webb telescope) తాజాగా అత్యంత అరుదైన ఫొటో తీసింది. మన సూర్యుడు ఉన్న పాలపుంతకు చెందిన హృదయం లాంటి ప్రాంతాన్ని కెమేరాలో బంధించింది (Heart of the galaxy).

సాగిటేరియస్-సీగా (Sagittarius C) పేరుపెట్టిన ఈ ప్రదేశంలో సుమారు 5 లక్షల నక్షత్రాలు ఉన్నాయి. నిజానికి పరిమాణంలో అవి సూర్యుడి కంటే పెద్దగా ఉన్నా పూర్తి స్థాయి నక్షత్రాలు కావు. ఇప్పుడిప్పుడే నక్షత్రాలుగా మారుతున్న ప్రోటోస్టార్స్. మిల్కీవే గెలాక్సీ మధ్యలో, భూమికి 300 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అతి భారీ కృష్ణ బిలానికి చేరువలో ఈ ప్రాంతం ఉంది. ఈ నక్షత్రాలన్నీ పరిమాణంలో సూర్యుడి కంటే 30 రెట్లు పెద్దవి. ఇంతకు ముందే శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని గుర్తించారు. అయితే అది చాలా వరకు ఊహాజనితంగానే ఉండిపోయింది.

Most Expensive Whiskey: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన విస్కీ ఇదే.. ధర లక్షల్లో కాదండోయ్.. కోట్లలో..!

తాజాగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఆ అద్బుత ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. ఈ ఫొటోలు చూసి అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు. పాలపుంతకు హృదయంగా భావించే ఈ ప్రాంతం గురించి అధ్యయనం చేస్తే నక్షత్రాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గాలిక్సీల పుట్టుకకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2023-11-21T19:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising