Mahesh Fan Post Viral: ప్రాణం కాపాడారు... దైవం స్థానంలో ఉన్నారు!
ABN, First Publish Date - 2023-02-23T12:43:10+05:30
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుండె సంబంధిత (Heart surgery) వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆయన వైద్యం చేయించి ప్రాణం పోస్తున్నారు.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh Babu) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గుండె సంబంధిత (Heart surgery) వ్యాధులతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు ఆయన వైద్యం చేయించి ప్రాణం పోస్తున్నారు. తాజాగా మరో చిన్నారి ప్రాణాలను ఆయన రక్షించారు. దీనికి సంబంధించి మహేశ్, నమత్ర, మహేశ్‌బాబు ఫౌండేషన్‌కు (Maheshbabu Foundation) కృతజ్ఞతలు చెబుతూ ఉన్న ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. అభిమాని చేసిన ఆ పోస్ట్‌లో ఏముందంటే... (Fan post viral )
‘కొన్ని వారాల క్రితం నా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను ఫోన్ చేసి ఓ చిన్నారి గుండెకు సంబంధించి శస్త్ర చికిత్స కోసం ఇబ్బంది పడుతున్న ఓ పేద కుటుంబం గురించి చెప్పాడు. మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా సహాయం అందేలా చేయమని కోరాడు. నేను వెంటనే ఆ సమస్యను ఎంబీ ఫౌండేషన్ దృష్టికి తీసుకెళ్లాను. నేరుగా నమ్రతగారితో (namratha) మాట్లాడాను. ఆవిడ వెంటనే సంబంధిత వివరాలు పంపమని చెప్పారు. ఆ చిన్నారి కుటుంబానికి కావలసిన సాయం తక్షణమే అందించమని ఎంబీ ఫౌండేషన్ సిబ్బందికి ఆదేశించారు. రెండు వారాల తర్వాత అంటే ఈ రోజు ‘‘సర్జరీ తర్వాత ఆ చిన్నారి కోలుకుంది’ అనే మెసేజ్ నాకు వచ్చింది. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడిన మహేశ్‌బాబుగారి కుటుంబంపై ఆ తల్లిదండ్రులు ఎంతో కృతజ్ఞత చూపిస్తున్నారు. కష్టకాలంలో ఆదుకున్న వారిని దైవంగా భావిస్తారు. ఇప్పుడు ఆ చిన్నారి తల్లిదండ్రుల దృష్టిలో మహేశ్‌బాబు దైవం స్థానంలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-02-23T12:57:40+05:30 IST