ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Black Salt: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బ్లాక్ సాల్ట్.. దానిని తయారు చేయడానికి ఎంత శ్రమపడతారో తెలుసా?

ABN, First Publish Date - 2023-08-06T13:37:10+05:30

ఉప్పు లేని ఆహారం తినడం ఎంత కష్టమో తెలిసిందే. వంటలో ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు తగినంతగా లేకపోతే రుచి మొత్తం పోతుంది. అలాగని ఉప్పు ఎక్కువగా వేసుకుంటే రక్తపోటు వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అనారోగ్య కారణాల వల్ల తెల్ల ఉప్పును కాకుండా బ్లాక్‌సాల్ట్‌ను చాలా మంది వినియోగిస్తున్నారు.

ఉప్పు (Salt) లేని ఆహారం తినడం ఎంత కష్టమో తెలిసిందే. వంటలో ఎన్ని పదార్థాలు వేసినా ఉప్పు తగినంతగా లేకపోతే రుచి మొత్తం పోతుంది. అలాగని ఉప్పు ఎక్కువగా వేసుకుంటే రక్తపోటు వంటి ఎన్నో సమస్యలు మొదలవుతాయి. అనారోగ్య కారణాల వల్ల తెల్ల ఉప్పును కాకుండా బ్లాక్‌సాల్ట్‌ (Black Salt)ను చాలా మంది వినియోగిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు, మధుమేహం ఉన్నవారు బ్లాక్ సాల్ట్‌ను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో పొటాషియంతో పాటు మెగ్నీషియం, క్యాల్షియం వంటి అనేక రకాల పోషకాలు లభిస్తాయి.

ఇన్ని పోషకాలు కలిగిన బ్లాక్‌సాల్ట్ పాకిస్థాన్ నుంచి వస్తుందని ప్రచారం జరుగుతోంది. లేదా పర్వతాల నుంచి ఈ

సాల్ట్‌ను తయారు చేస్తారని అంటుంటారు. కానీ, ఈ ఉప్పు భారతదేశంలోనే తయారవుతుంది. బ్లాక్‌ సాల్ట్‌ని ఎలా తయారు చేస్తారో చూపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నల్ల ఉప్పును తయారు చేయడం అంత సులభం కాదు. ఎంతో శ్రమపడాలి. ముందుగా రాజస్థాన్‌ (Rajasthan)లోని సాంభార్ సరస్సు (Sambhar lake) నుంచి తెల్లగా ఉండే ఉప్పును సేకరిస్తారు (Making Of Black Salt).

Viral: నేను తాగి ఉన్నా.. అంటూ మద్యం మత్తులో బాస్‌కు ఉద్యోగి మెసేజ్.. ఆ బాస్ రియాక్షన్ ఏంటంటే..

ఆ ఉప్పును ఫ్యాక్టరీకి తరలిస్తారు. పేడ పడికలు, బొగ్గులువేసి మంట పెడతారు. మంటపై పెద్ద పెద్ద కుండలు పెట్టి అవి కదలకుండా ఏర్పాట్లు చేస్తారు. ఆ కుండల్లో ఆ తెల్లటి ఉప్పును, బాదం తొక్కలను వేసి 24 గంటల పాటు అలా మంట పెడతారు. ఆ తర్వాత కుండలను చల్లార్చి లోపల నుంచి నల్లగా ఉండే ఉప్పు బాల్స్‌ను బయటకు తీసి పగలగొడతారు. అలా బ్లాక్‌సాల్ట్‌ను తయారు చేస్తారు.

Updated Date - 2023-08-06T13:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising