Viral Video: ఇదేం పిచ్చి సామీ.. పందితో కలిసి నూడిల్స్ తింటున్న యువకుడు.. కొత్త వైరస్ కోసం అంటూ కామెంట్లు..
ABN, First Publish Date - 2023-10-01T16:09:12+05:30
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. పెంపుడు జంతువు అంటే ఎంత ప్రేమ ఉన్నా అది తినే ప్లేట్‌లోనే తాము కూడా తినాలని ఎవరూ అనుకోరు. అయితే ప్రస్తుతం వైరల్ ఒక వీడియో సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది.
ప్రస్తుతం చాలా మంది ఇళ్లలో పెంపుడు జంతువులను (Pets) పెంచుకుంటున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు. పెంపుడు జంతువు అంటే ఎంత ప్రేమ ఉన్నా అది తినే ప్లేట్‌లోనే తాము కూడా తినాలని ఎవరూ అనుకోరు. అయితే ప్రస్తుతం వైరల్ ఒక వీడియో (Viral Video) సోషల్ మీడియా జనాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలో ఒక వ్యక్తి పంది (Pig)తో పాటు ఓకే పాత్రలో తినడం కనిపిస్తోంది. theanimalsreport అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Shocking Video) షేర్ అయింది.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తొట్టె నిండా నూడిల్స్ (Noodles) ఉన్నాయి. ఆ తొట్టెలో ఒక వైపు పంది, మరో వైపు ఓ యువకుడు అతి వేగంగా నూడిల్స్ తింటున్నారు (Man and pig eating noodles). చూస్తుంటే ఆ పంది, యువకుడు తిండి పోటీ పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు ఆ తొట్టెలో కాలు, నోరు పెట్టి పంది వేగంగా తింటోంది. మరోవైపు ఉన్న ఆ యువకుడు తన రెండు చేతులతోనూ నూడిల్స్ తీసుకుని నోట్లో కుక్కేసుకుంటున్నాడు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 38 లక్షల మందికి పైగా వీక్షించారు.
Viral Video: గాజులు తొడిగి, చీర కప్పి.. కుక్కకు సీమంతం చేసిన కుటుంబం.. వైరల్ అవుతున్న వీడియో!
ఈ వైరల్ వీడియోకు 33 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``మరో కొత్త రకం వైరస్ సృష్టి కోసం అనుకుంటా``, ``నూడిల్స్ తింటున్నవి రెండూ పందులే``, ``ఈ వీడియో చూస్తుంటే నాకు అనారోగ్యం వచ్చినట్టు అనిపిస్తోంది``, ``కరోనా వైరస్ ఇలాంటి పనుల వల్లే పుట్టి ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Updated Date - 2023-10-01T16:09:12+05:30 IST