Viral Video: నీ ఓపికకు సలాం చెప్పాల్సిందే.. ఒక్క గంటలో ఎన్ని వేల పుష్-అప్స్ చేశాడో తెలిస్తే..!
ABN, First Publish Date - 2023-07-15T15:38:48+05:30
వ్యాయామంలో భాగంగా కొందరు పుష్-అప్స్ చేస్తుంటారు. అప్పర్ బాడీ మంచి షేప్ రావడానికి, దృఢంగా మారడానికి పుష్-అప్స్ బాగా ఉపయోగపడతాయి. పుష్-అప్స్ చేయాలంటే ఓ మాదిరి ఫిట్‌నెస్ ఉండాల్సిందే. వరుసగా 50 పుష్-అప్స్ తీయడం చాలా కష్టం. అలాంటిది..
వ్యాయామంలో భాగంగా కొందరు పుష్-అప్స్(Push ups ) చేస్తుంటారు. అప్పర్ బాడీ మంచి షేప్ రావడానికి, దృఢంగా మారడానికి పుష్-అప్స్ బాగా ఉపయోగపడతాయి. పుష్-అప్స్ చేయాలంటే ఓ మాదిరి ఫిట్‌నెస్ ఉండాల్సిందే. వరుసగా 50 పుష్-అప్స్ తీయడం చాలా కష్టం. అలాంటిది ఆగకుండా 100 పుష్-అప్స్ చేసిన వారిని చాలా గొప్పగా చూస్తుంటాం.అయితే ఓ వ్యక్తి గంటలో ఏకంగా 3249 పుష్-అప్స్ తీశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డును (Guinness World Record) బద్దలు కొట్టాడు.
ఆస్ట్రేలియా (Australia)కు చెందిన ఫిట్‌నెస్ ప్రియుడు డానియేల్ (Daniel Scali) ఒక గంటలో ఆగకుండా ఏకంగా 3249 పుష్-అప్స్ చేశాడు. గతంలో ఆస్ట్రేలియాకే చెందిన యోల్డ్ లుకాస్ హెల్మ్కే (Lukas Helmke) అనే అథ్లెట్ ఒక గంటలో 3206 పుష్-అప్స్ తీసి గిన్నీస్ రికార్డు సాధించాడు. తాజాగా ఆ రికార్డును డానియేల్ బద్దలు గొట్టాడు. అయితే డానియేల్ రికార్డు అంత ఈజీగా వచ్చిందేం కాదు. ఎందుకంటే డానియేల్ చిన్నప్పటి నుంచి ఏడమ చేతి నొప్పితో బాధపడుతున్నాడు. అయినా పట్టువదలకుండా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి రికార్డులు సాధిస్తున్నాడు.
Viral: పెళ్లి జరిగిన రోజే ప్రియుడికి వీడియో కాల్.. అత్తింట్లో ఉంటూనే లవర్‌తో రాసలీలలు.. చివరకు ఆమె ఏం చేసిందంటే..
గతేడాది ఏప్రిల్‌లో డానియేల్ ఒక గంటలో 3182 పుష్-అప్స్ చేసి రికార్డు సృష్టించాడు. ఆ రికార్డును ఆస్ట్రేలియాకే చెందిన యోల్డ్ లుకాస్ నవంబర్‌లో అధిగమించాడు. తాజాగా లుకాస్ రికార్డును డానియేల్ దాటేసి మళ్లీ నెంబర్ వన్‌కు చేరుకున్నాడు. డానియేల్ రికార్డుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. డానియేల్ ఫిట్‌నెస్‌పై సోషల్ మీడియా జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Updated Date - 2023-07-15T15:38:48+05:30 IST