ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అయ్యో.. 19 ఏళ్ల కుర్రాడికి ఇలాంటి పరిస్థితా?.. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా గుండెపోటు.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ABN, First Publish Date - 2023-09-17T10:48:55+05:30

కరోనా మహమ్మారి తర్వాత గుండె సంబంధిత సమస్యలు విజృంభిస్తున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అనూహ్యంగా ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా జిమ్‌లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఓ 19 ఏళ్ల కుర్రాడు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై నడస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.

కరోనా మహమ్మారి తర్వాత గుండె సంబంధిత సమస్యలు (Heart Problems) విజృంభిస్తున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అనూహ్యంగా ప్రాణాలు తీస్తున్నాయి. ముఖ్యంగా జిమ్‌ (Gym)లో వ్యాయామం చేస్తూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా ఓ 19 ఏళ్ల కుర్రాడు జిమ్‌లో ట్రెడ్‌మిల్‌ (Treadmill)పై నడస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఘటన జిమ్‌లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో చూసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు (Viral Video).

ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్‌ (Ghaziabad)లోని ఓ జిమ్‌లో ఓ యువకుడు శనివారం మధ్యాహ్నం ట్రెడ్‌మిల్‌పై పరిగెడుతున్నాడు. అంతలో ఒక్కసారిగా బలహీనంగా మారి కింద పడిపోయాడు. అతడు అలసిపోయి ఉంటాడని, లేదా కళ్లు తిరిగి ఉంటాయని చుట్టు పక్కల వారు భావించి అతడి దగ్గరకు వెళ్లారు. అయితే అప్పటికే ఆ కుర్రాడిలో చలనం లేదు. ట్రెడ్‌మిల్‌పై నడుస్తుండగా కార్డియాక్‌ అరెస్ట్‌ (Cardiac Arrest) కావడంతో ఆ కుర్రాడు మరణించాడు. జిమ్ నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Man Cheats Girlfriend: వామ్మో.. వాళ్లు వీడియోలు తీయకపోయి ఉంటే.. ఈ ప్రియుడి బండారం బయటపడేదే కాదు..!

మృతుడు బీహార్ (Bihar) నివాసి సిద్దార్థ్‌ కుమార్‌ సింగ్‌ అని తెలుస్తోంది. అతని మృతదేహాన్ని బీహార్‌లోని స్వగ్రామానికి తరలించారు. కాగా, వ్యాయామం చేస్తూ ఇప్పటికే ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇదే తరహాలో మరణించిన సంగతి తెలిసిందే. మితిమీరిన వ్యాయామం, మానసిక ఒత్తిళ్ల కారణంగానే ఇలా చాలా మంది చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-17T10:48:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising