ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పాపం.. ఆ దొంగల టైమ్ బాగాలేదు.. ఇంట్లోంచి పారిపోతున్న వారిని లాక్కొచ్చి మరీ కొట్టాడు.. వీడియో వైరల్!

ABN, First Publish Date - 2023-08-21T15:55:32+05:30

సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే ఎవరైనా భయపడతారు. అరచి గట్టిగా కేకలు వేస్తారు. సాధ్యమైనంత త్వరగా వారిని ఇంటి నుంచి బయటకు తరిమేయాలని చూస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చిన దొంగలతో ఫైటింగ్‌కు దిగాడు. వారు పారిపోతుంటే పట్టుకుని ఇంట్లోకి లాక్కొచ్చి మరీ కొట్టాడు.

సాధారణంగా ఇంట్లో దొంగలు (Thieves) పడితే ఎవరైనా భయపడతారు. అరచి గట్టిగా కేకలు వేస్తారు. సాధ్యమైనంత త్వరగా వారిని ఇంటి నుంచి బయటకు తరిమేయాలని చూస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తించాడు. ఇంటికి వచ్చిన దొంగలతో ఫైటింగ్‌కు దిగాడు (Man fight with robbers). వారు పారిపోతుంటే పట్టుకుని ఇంట్లోకి లాక్కొచ్చి మరీ కొట్టాడు. ఈ ఘటన మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

@idiotsInCamera అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ``ఇద్దరు దొంగలు ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంటి ఓనర్ వారిని కొట్టడానికి ఇంట్లోకి లాక్కొచ్చాడు`` అంటూ కామెంట్ చేశారు. ఇద్దరు దొంగలతో ఓ వ్యక్తి గొడవ పడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దొంగలు ఇద్దరు ఉన్నప్పటికీ ఆ వ్యక్తి బలంగా దాడి చేశాడు. వారు తిరిగి కొడుతున్నప్పటికీ వెనకడుగు వేయలేదు. దీంతో కొద్దిసేపటి తర్వాత ఆ దుండగులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి వారిని వెంబడించి మళ్లీ ఇంట్లోకి లాక్కొచ్చి చితక్కొట్టాడు.

Viral: స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి క్రేజీ సూచనలు ఇచ్చిన కస్టమర్.. నెటిజన్లు ఎలాంటి కామెంట్లు చేశారంటే..

ఈ వైరల్ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 77 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ``పాపం.. ఆ దొంగల టైమ్ బాగాలేదు``, ``పారిపోతున్న వారిని లాక్కొచ్చి మరీ కొట్టడం బాగుంది``, ``దెబ్బలు తినడానికి మనుషులు దొరకడంతో ఆ వ్యక్తి పండగ చేసుకున్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-21T15:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising