Viral News: ఆ పెద్దాయనకు ఇదేం పాడుబద్ధో.. సొంత కోడలు.. పైగా 6నెలల చిన్నారికి తల్లి కూడా.. కొడుకు భార్యతో ఇవేం పనులంటూ నెటిజన్ల విసుర్లు!
ABN, First Publish Date - 2023-03-05T13:44:42+05:30
ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే వావివరసలు లేకుండా పోతున్నాయి. తాజాగా ఇదే కోవలో ఓ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan) చోటు చేసుకుంది. సొంత కుమారుడి పెళ్లాన్ని ప్రేమించిన తండ్రి.. ఆమెను తీసుకుని పారిపోయాడు. దాంతో బాధితుడు తన తండ్రి, పెళ్లాంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బుండీ పరిధిలోని సిలోర్ గ్రామంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. పవన్ వైరాగీ అనే వ్యక్తి స్థానిక సదర్ పోలీస్ స్టేషన్‌లో (Sadar police station) తన భార్య, తండ్రి ఇంట్లో నుంచి వెల్లిపోయినట్లు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పవన్, అతడి భార్యకు ఆరు నెలల పాప కూడా ఉంది. అయినా ఆమె తన తండ్రి రమేష్‌తో లేచిపోయిందని, అతడే ఆమెకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని పవన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను పని నిమిత్తం కొన్ని రోజులుగా ఊరికి బయట ఉంటున్నానని, ఇంతలో తన తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు వాపోయాడు. ఇక వారిద్దరూ ఇంట్లోంచి వెళ్లేటప్పుడు తన బైక్ కూడా దొంగలించినట్లు తండ్రిపై ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం బయటకు రావడం, అది కాస్త నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు పెద్దాయనను ఘోరంగా విమర్శిస్తున్నారు. కాగా, ఇటీవలే ఇదే కోవలో రాజస్థాన్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. 40 ఏళ్ల అత్త తన సొంత అల్లుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఈ జంట కూడా అచ్చం ఇలాగే లేచిపోయింది.
ఇది కూడా చదవండి: అదానీ షేర్ల దూకుడుతో ఆ ఎన్నారై పంటపడింది.. రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 3,100 కోట్ల లాభం..!
Updated Date - 2023-03-05T13:47:21+05:30 IST