Health: తరచుగా షాంపూతో తలస్నానం చేస్తుంటారా? ఏడేళ్లుగా షాంపూ వాడని వ్యక్తి జట్టు ఎలా అయిందంటే..
ABN, First Publish Date - 2023-10-01T10:04:46+05:30
ఒత్తైన జుట్టుతో అందంగా కనిపించాలని ఆడవాళ్లు మాత్రమే కాదు.. మగవారు కూడా కోరుకుంటారు. జట్టు ఎక్కువగా రాలిపోతుంటే బట్టతల వచ్చేస్తుందేమోనని ఆందోళన పడుతుంటారు. జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఆయిల్స్, షాంపూలు వాడుతుంటారు. అయితే అసలు షాంపూ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది?
ఒత్తైన జుట్టుతో (Hair) అందంగా కనిపించాలని ఆడవాళ్లు మాత్రమే కాదు.. మగవారు కూడా కోరుకుంటారు. జట్టు ఎక్కువగా రాలిపోతుంటే బట్టతల వచ్చేస్తుందేమోనని ఆందోళన పడుతుంటారు. జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఆయిల్స్, షాంపూలు (Shampoos) వాడుతుంటారు. అయితే అసలు షాంపూ ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది? అది కూడా ఒకటి, రెండు సంవత్సరాలు కాదు.. ఏడు సంవత్సరాల పాటు జుట్టుకు షాంపూ పెట్టకపోతే ఏమవుతుంది? ఓ యువకుడు అలాంటి ప్రయోగం చేసి చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఓ యూట్యూబ్ (Youtube) వీడియో ద్వారా వివరించాడు.
ఆ వ్యక్తి యుక్త వయసుకు వచ్చినప్పటి నుంచే జుట్టు సంరక్షణ కోసం షాంపూ ఉపయోగించేవాడు. అయితే ఎంత ఖరీదైన షాంపూలు వాడినా అతడి జుట్టు ఊడిపోతూ ఉండేది (Hair Fall). ఏడేళ్ల క్రితం తన జుట్టుకు యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడేవాడినని, అప్పుడు తన నెత్తి మీద పొలుసులు పొలుసులుగా ఉండేదని చెప్పాడు. జుట్టు పరిస్థితి చూసి, ఇకపై షాంపూ, కండీషనర్ వాడటం మానేయాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నట్టుగానే ఏడేళ్లుగా ఆ వ్యక్తి షాంపూ, కండీషనర్ వాడడం మానేశాడు. అవి మానేయడం వల్ల అతడి జుట్టు చాలా మెరుగుపడిందట (Health Tips).
షాంపూ వాడకపోవడం వల్ల ఆ వ్యక్తి జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోయిందట. అలాగే జుట్టు మృదువుగా కూడా మారిందట. అంతకు ముందు ఉన్నట్టు నెత్తి మీద పొలుసులు కూడా ఇప్పుడు లేవట. అలాగే డాండ్రఫ్ సమస్య కూడా చాలా వరకు తగ్గిపోయిందట. ప్రస్తుతం అతడి జట్టు చాలా పొడవుగా, ఒత్తుగా కనిపిస్తోంది. అంతేకాదు షాంపూ వాడడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా, అనర్థాలు ఉన్నాయని ఆ వ్యక్తి తన ప్రయోగం ద్వారా తెలుసుకున్నాడట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Updated Date - 2023-10-01T10:04:46+05:30 IST