Viral Video: ఏం క్రియేటివిటీ బాసూ.. నేల మీదే కాదు నీటిలో కూడా వెళ్లే బైక్.. ఎలా ప్లాన్ చేశాడో చూడండి..
ABN, First Publish Date - 2023-10-15T20:33:28+05:30
ట్యాలెంట్‌కు డబ్బుతో పని లేదు. నిజానికి సాధారణ వ్యక్తులే అసాధారణ ఆవిష్కరణలు చేస్తుంటారు. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ట్యాలెంట్ (Talent)కు డబ్బుతో పని లేదు. నిజానికి సాధారణ వ్యక్తులే అసాధారణ ఆవిష్కరణలు (Innovations) చేస్తుంటారు. అవసరానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో సరికొత్త వస్తువులను తయారు చేస్తుంటారు. సోషల్ మీడియా ద్వారా అలాంటి ఎన్నో క్రియేటివ్ ఐడియాలు (Ideas) వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో (Jugaad Videos) నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో (Viral Video) చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి పూర్తిగా స్వంత పరిజ్ఞానంతో ఓ బైక్‌ను తయారు చేశాడు. ఆ బైక్ (Water Bike) నీటిలో కూడా వేగంగా వెళుతోంది.
crackmind111 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వ్యక్తి నాలుగు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ములను రెండు వైపులా బైక్‌కు కట్టాడు. అనంతరం బైక్‌ను ఓ నదిలోకి పోనిచ్చాడు. ఆ ప్లాస్టిక్ డ్రమ్ముల వల్ల ఆ బైక్ నీటిలో మునిగిపోకుండా ముందుకు వెళ్లింది. నది మధ్యలోకి వెళ్లిన తర్వాత ఆ యువకుడు బైక్‌ను ఆపి హాయిగా పడుక్కున్నాడు. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆ వ్యక్తి తెలివిని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
Viral Video: ఇది మరో రకం పిచ్చి.. గోనె సంచి వేసుకున్న హీరోయిన్.. ఉర్ఫీ జావేద్ అనుకుంటే తప్పులో కాలేసినట్టే..
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ``ఈ ప్రయత్నం చాలా సృజనాత్మకంగా ఉంది. కానీ, ఇది ప్రమాదకరం కావొచ్చు``, ``అద్భుతమైన ఐడియా``, ``దీని వెనకాల సైన్స్ ఉంది``, ``వీడియో కోసమే ఈ వాటర్ బైక్‌ను రూపొందించారా``, ``ఐడియా బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-15T20:33:28+05:30 IST