ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఇదెక్కడి పైత్యం భయ్యా.. పెట్రోల్‌తో బైక్ వాష్.. రీల్స్ కోసం మరీ ఇంత రిస్క్ అవసరమా?

ABN, First Publish Date - 2023-08-01T18:45:14+05:30

సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించడం కోసం నేటి యువత చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు.

సోషల్ మీడియా (Social Media)లో రీల్స్ (Reels), వీడియోల ద్వారా పాపులారిటీ సంపాదించడం కోసం నేటి యువత చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియా వ్యూస్ కోసం కొందరు విచిత్ర విన్యాసాలు చేస్తుంటే, మరికొందరు ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. ముఖ్యంగా బైక్‌లతో చేసే సాహసాలు (Bike stunt Videos) బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అమ్రోహకు చెందిన ఓ కుర్రాడు చాలా పెద్ద సాహసానికి ఒడిగట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

@Sachingupta788 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కుర్రాడు పెట్రోల్ పైప్ తీసుకుని తన బండిని స్వయంగా నింపుకుంటున్నాడు. ట్యాంక్ నిండిపోయినా ఆపకుండా ఆ పెట్రోల్‌‌తోనే తన బైక్‌ను వాష్ చేసుకున్నాడు (washing bike with petrol). ఏ మాత్రం తేడా వచ్చినా ఆ కుర్రాడు మాత్రమే కాదు.. ఆ బంకు మొత్తం పేలిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 24 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు.

Grandmother: ఆరేళ్ల పిల్లాడిని చంపిన నాయనమ్మ.. తల్లి ఫిర్యాదుతో బయటపడిన నిజం.. ఎందుకీ పని చేశావని పోలీసులు నిలదీస్తే..

ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``కేవలం రీల్స్ కోసం ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తారా?``, ``ఇలాంటి పిచ్చి వాళ్లు తమను తామే చంపేసుకుంటారు. ఇతరులను కూడా చంపేస్తారు``, ``పోలీసులు వెంటనే స్పందించి అతడిని అరెస్ట్ చేయాలి`` అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. స్పందించిన అమ్రోహా పోలీసులు ఆ వీడియోలోని కుర్రాడిపై కేసు నమోదు చేశారు. అతడిని గుర్తించి అరెస్ట్ చేసే పని ప్రారంభించారు.

Updated Date - 2023-08-01T18:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising