ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వారెవ్వా.. ఈ టెక్నిక్ సూపర్ బాసూ.. డ్రిల్లింగ్ మెషిన్‌తో జ్యూస్ ఎలా తయారు చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-11-17T19:20:25+05:30

తెలివి తేటలు ఉంటే అసాధ్యమనుకున్న పనిని కూడా సులభంగా పూర్తి చెయ్యొచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా తేలికగా పరిష్కారం వెతకొచ్చు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి తెలివి తేటలన్నీ భారతీయులకే సొంతమని చాలా మంది భావిస్తుంటారు.

తెలివి తేటలు ఉంటే అసాధ్యమనుకున్న పనిని కూడా సులభంగా పూర్తి చెయ్యొచ్చు. ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా తేలికగా పరిష్కారం వెతకొచ్చు. అలాంటి ఎన్నో జుగాడ్ వీడియోలు (Jugaad Videos) ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Videos) మారాయి. అలాంటి తెలివి తేటలన్నీ భారతీయులకే సొంతమని చాలా మంది భావిస్తుంటారు. అయితే తాజాగా బ్రిటన్‌ (Britain)కు చెందిన ఓ వ్యక్తి కూడా తన ట్యాలెంట్ చూపించాడు. డ్రిల్లింగ్ మెషిన్‌ను (Drilling Machine) మిక్సీలా ఉపయోగించి జ్యూస్ (Juice) తయారు చేశాడు.

p4ulx_ch అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి మిక్సీ జార్‌లో పళ్ల ముక్కలు వేశాడు. అయితే అక్కడ మిక్సీ లేదు. దీంతో డ్రిల్లింగ్ మెషిన్‌ను మిక్సీ జార్ దిగువ భాగంలో ఇన్‌స్టాల్ చేసి ఆన్ చేశాడు. డ్రిల్లింగ్ మెషిన్ మిక్సీలా పని చేసింది. జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

World Cup2023: పెళ్లి తర్వాతైనా చూడొచ్చు.. ముందు మ్యాచ్ చూడాలి.. పెళ్లి వేడుకలో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. వీడియోలోని వ్యక్తి తెలివి తేటలకు ఆశ్చర్యపోయారు. ``సంకల్పం ఉన్నచోట ఏదో ఒక మార్గం ఉంటుంది``, ``గ్రేట్ ఐడియా``, ``నిజమే.. మిక్సీ చేసే పనే డ్రిల్లింగ్ మెషిన్ కూడా చేస్తుంది``, ``టిక్‌టాక్ చాలా మందికి విజ్ఞానం అందిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-11-17T19:20:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising