ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: లగ్జరీ కారుకు దూరంగా ఉండి ఫొటోను తీసేందుకు ప్రయత్నిస్తున్నాడో వ్యక్తి.. కారు ఓనర్ రియాక్షన్ చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-13T16:42:42+05:30

రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఖరీదైన లగ్జరీ కార్లను చూసినపుడు చాలా మంది వాటి వైపు చూస్తుంటారు. అలాంటి కార్లలో తిరగలేకపోయినా కనీసం వాటి ముందు నిల్చుని ఫొటోలు తీసుకోవాలనుకుంటారు. ఎవరూ లేకపోతే వాటి ముందు నిల్చుని ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు.

రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఖరీదైన లగ్జరీ కార్లను (Luxury Car) చూసినపుడు చాలా మంది వాటి వైపు చూస్తుంటారు. అలాంటి కార్లలో తిరగలేకపోయినా కనీసం వాటి ముందు నిల్చుని ఫొటోలు తీసుకోవాలనుకుంటారు. ఎవరూ లేకపోతే వాటి ముందు నిల్చుని ఫొటోలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి సమయంలో కార్లు ఓనర్లు (Car Owner) వస్తే ఏమైనా అంటారేమోనని భయపడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video)అవుతోంది.

aamirsharma అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ సూపర్ కార్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంది. ఓ కామన్ మ్యాన్ ఆ కారు చూసి దాని పక్కన నిల్చుని ఫొటో తీసుకోవాలనుకున్నాడు. ఆ సమయంలో కార్ ఓనర్ అక్కడకు వచ్చాడు. ఓనర్‌ను చూసి ఆ వ్యక్తి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ ఓనర్ ఆ వ్యక్తిని పిలిచి దగ్గరుండి ఫొటో తీశాడు. దాంతో ఆ వ్యక్తి సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Father Love: కూతురంటే మరీ ఇంత ప్రేమా..? ప్రపంచంలోనే ఏ తండ్రీ చేయని సాహసమే చేశాడు..!

ఆ వీడియో చాలా మందిని ఆకట్టుకుంది. ఇప్పటివరకు 2 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 35 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``బ్రదర్.. మీ హృదయం చాలా గొప్పది``, ``మీరు నిజమైన ధనవంతులు``, ``ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఉన్నాడో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-13T16:42:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising