Manchu Manoj: పెళ్ళైన రెండో రోజున మనోజ్ ఏం చేసాడో తెలుసా..!

ABN, First Publish Date - 2023-03-05T15:38:23+05:30

దివంగత భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మంచు మనోజ్‌. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ నెల 3న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.

Manchu Manoj: పెళ్ళైన రెండో రోజున మనోజ్ ఏం చేసాడో తెలుసా..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

దివంగత భూమా నాగిరెడ్డి (Bhuma Naagi reddy)- శోభా నాగిరెడ్డి (Bhuma Shoba Naagireddy) దంపతుల కుమార్తె మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మంచు మనోజ్‌ (Manchu manoj). వీరిద్దరికీ ఇది రెండో వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో ఈ నెల 3న మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఆదివారం ఉదయం నూతన దంపతులు భారీ కాన్వాయ్‌తో కర్నూల్‌(kurnool Trip) బయలుదేరారు. తొలుత ప్రొద్దుటూరులో రామ సుబ్బారెడ్డిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆళ్లగడ్డలోని భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. (manchu manoj Condolence to Bhuma Family)

మంచు మనోజ్‌కు 2015లోనే ప్రణతి రెడ్డితో వివాహమైంది. పలు కారణాలతో 2019లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మౌనికా రెడ్డితో గతంలో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగి, విడాకులు అయ్యాయి. ఆమెకు ధైరవ్‌ రెడ్డి కొడుకు కూడా ఉన్నాడు. తాజాగా మౌనికను పెళ్లి చేసుకున్న మనోజ్‌ ధైరవ్‌ బాధ్యతను కూడా తీసుకున్నట్లు ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ ద్వారా తెలిపారు.

Manoj.jpg

Updated Date - 2023-03-05T17:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising