ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: పచ్చని పెళ్లి పందిట్లో.. వేడి వేడి పూరీ గొడవ.. రాత్రి 2 గంటల సమయంలో ఓ వ్యక్తి వింత డిమాండ్.. చివరకు..!

ABN, First Publish Date - 2023-05-04T20:09:33+05:30

అంత రాత్రి సమయంలో అతని డిమాండ్ చూసి అక్కడివారు తెల్లబోయారు. అతనిమీద కోపం వచ్చినా తమాయించుకున్నారు. కానీ ఆ తరువాత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్ళంటే నలుగురు ఇంటికొచ్చి వెళ్లినట్టు కాదు, బంధువులు, అతిథులు, ముఖ్యంగా వరుడివైపు నుండి వచ్చేవారు చాలామంది ఉంటారు. భోజనాల దగ్గరనుండి, విడిది వరకు ఎవరికీ ఏ లోటూ రాకుండా చూసుకోవడం వధువు తరపు వారికి పెద్ద టాస్కే.. కొంతమంది అయితే ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా తమ దర్పం చూపించాలని వింత డిమాండ్లు చేస్తూంటారు. ఓ పెళ్ళి వేడుకలో ఓ వ్యక్తి ఇలాగే వింత డిమాండ్ చేశాడు. రాత్రి 2గంటల సమయంలో 'నాకు వేడివేడిగా పూరీ తినాలని ఉంది, వెంటనే తెప్పించండి' అంటూ భీష్మించుక్కూర్చున్నాడు. అతను అడిగినట్టు ఆ సమయంలో వేడి వేడి పూరీ రాకపోవడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పూరీ కోసం మొదలైన ఈ గొడవ కాశ్మీర్ అల్లర్లకేమీ తీసిపోదని, ఆ రేంజ్ లో అక్కడ రచ్చ జరిగిందని అంటున్నారు. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లింట్లో పూరీ కారణంగా జరిగిన రచ్చ గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

జార్థండ్(Jharkhand) రాష్ర్టం గిరిదిహ్(Giridih) జిల్లాలో పాత్రోడి అనే గ్రామముంది. అక్కడ శంకర్ అనే వ్యక్తి ఇంట్లో అతని కూతురు పెళ్ళి ఏర్పాటుచేశారు(Arrange marriage in home). పెళ్ళికి వచ్చిన అతిథులు, బంధువులు, స్నేహితుల(Friends, guests, relatives) మధ్య ఇల్లంతా చాలా సందడిగా ఉంది. రాత్రి కావడంతో చాలామంది నిద్రపోయారు. మరికొందరు మరుసటిరోజు జరగాల్సిన పెళ్లి కోసం ఏర్పాట్లు చూసుకుంటున్నారు. రాత్రి 2గంటల(Night 2 AM) సమయంలో అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. 'నాకు వేడి వేడి పూరీ తినాలని ఉంది, వెంటనే తెప్పించండి(demand hot poori)' అంటూ వధువు తరపున వారిని డిమాండ్ చేశాడు. అంత రాత్రి సమయంలో అతని డిమాండ్ చూసి అక్కడివారు తెల్లబోయారు. అతనిమీద కోపం వచ్చినా తమాయించుకున్నారు. అయితే రాత్రి 2గంటల(poori demand in marriage at night 2AM) సమయంలో అతనికి పూరీ తెప్పించడం కుదరలేదు, సరికదా వంటవారితో కూడా అప్పటికప్పుడు చేయించడం కష్టం. అతను అడిగింది చేయలేకపోయారు వారు. దీంతో అతనికి కోపం వచ్చింది. అతను వారిని ఇష్టానుసారం తిట్టాడు. అంతటితో ఊరుకోకుండా అక్కడినుండి బయటకు వెళ్లి ఇంకొంతమందిని వెంటబెట్టుకొచ్చాడు. వాళ్లందరూ అక్కడ గొడవ క్రియేట్ చేశారు. వధువు తరపు వారిని అసభ్యపదజాలంతో తిట్టారు. దీంతో వధువు తరపు వారు కూడా ఎదురుదాడికి దిగారు. ఈ గొడవ కాస్తా రాళ్లు విసురుకోవడం(throwing stones) వరకూ వెళ్లింది. ఈ రాళ్లదాడిలో ఆరుగురు గాయపడ్డారు కూడా. పెళ్లిమండపం కాస్తా రణరంగంగా మారిపోయింది.

Bride Sister: సొంత అక్క పెళ్లిలో ఓ చెల్లి రచ్చ.. వరుడిని నేనే పెళ్లాడతానంటూ బాంబు పేల్చడంతో అంతా షాక్.. అసలు నిజం తెలిసి..!


పెళ్ళి వేడుకలో గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గొడవకు గల కారణాలను ఆరా తీశారు. పెళ్లింటికి రాత్రి సమయంలో వచ్చి పూరీ డిమాండ్ చేసిన వ్యక్తి కావాలనే గొడవకు దిగాడని, వధువు కుటుంబ సభ్యులను అసభ్యపదజాలం ఉపయోగించి తిట్టాడని వధువు తరపు వారు చెప్పారు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకుని తమదైన శైలిలో విచారించగా పూరీ సాకుతో కావాలనే గొడవ పడ్డానని అతను అంగీకరించాడు. కాగా ఆ వ్యక్తి దగ్గరా, అతని వెంట ఉన్న వ్యక్తుల దగ్గరా పోలీసులకు పదునైన ఆయుధాలు లభించాయని తెలిసింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Viral Video: ఆటో ఆగకుండానే.. యమా స్పీడ్‌గా వెళ్తూనే పంక్చర్ అయిన టైర్‌ను మార్చేసిన డ్రైవర్.. చూస్తే అవాక్కవడం ఖాయం..!


Updated Date - 2023-05-04T20:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising