ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Marriage: ఈ వివాహం నాకిష్టం లేదంటూ స్నేహితురాలితో ఏడుస్తూ చెప్పిన వధువు.. ఒక్క ఫోన్‌తో పెళ్లి రోజు ఊహించని ట్విస్ట్..!

ABN, First Publish Date - 2023-05-23T17:30:47+05:30

ఓ అమ్మాయి అలాగే తనకు ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకుంది. కానీ పెళ్ళిరోజు వచ్చేసరికి తను కోల్పోయేది ఏమిటో అర్థమయ్యి ఆమె కన్నీరు మున్నీరైంది. పెళ్ళికి విచ్చేసిన తన స్నేహితురాలి ముందు ఈ పెళ్ళి నాకిష్టం లేదంటూ భోరున విలపించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలా చోట్ల పెద్దవాళ్ళ బలవంతంతో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అబ్బాయిలు అయినా పెళ్ళివద్దని ఎదురుతిరిగి పెద్దలను బెదిరిస్తారేమో కానీ అమ్మాయిలు పెద్దవాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కు లొంగిపోతారు. ఓ అమ్మాయి అలాగే తనకు ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రుల బలవంతం మీద పెళ్ళికి ఒప్పుకుంది. కానీ పెళ్ళిరోజు వచ్చేసరికి తను కోల్పోయేది ఏమిటో అర్థమయ్యి ఆమె కన్నీరు మున్నీరైంది. పెళ్ళికి విచ్చేసిన తన స్నేహితురాలి ముందు ఈ పెళ్ళి నాకిష్టం లేదంటూ భోరున విలపించింది. దీంతో వధువు స్నేహితురాలు తెలివిగా ఆలోచించింది. వారిద్దరూ కలసి చేసిన పనితో పెళ్ళి వేడుక పెద్ద మలుపు తీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హర్యానా(Haryana) రాష్ట్రం నూహ్(Nuh) జిల్లాలో ఓ పెళ్ళి వేడుకలో చాలా విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్ళికి ముందురోజు హర్యానా లోనే ఒకటైన భివానీ(Bhiwani) జిల్లా నుండి వరుడు, అతని కుటుంబ సభ్యులు(Groom, his family) నూహ్ జిల్లాలో పెళ్ళిమండపానిక చేరుకున్నారు. తరువాతి రోజు పెళ్ళి వేడుకకు అంతా సిద్దమవుతుండగా పెళ్ళికూతురు స్నేహితురాలు ఆమె దగ్గరకు వచ్చింది. పెళ్ళికూతురు తన స్నేహితురాలి ముందు కన్నీళ్ళు పెడుతూ 'నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇంకా బాగా చదువుకోవాలని ఉంది, నేను ఎంత చెప్పినా వినకుండా మా అమ్మనాన్నలు నాకు బాల్యవివాహం(Child Marriage) చేస్తున్నారు' అని బోరుమని ఏడ్చింది. ఆ అమ్మాయి అలా కన్నీళ్ళు పెట్టుకుంటుండం చూసి ఆమె స్నేహితురాలికి బాధవేసింది. ఎలాగైనా పెళ్ళి ఆపాలని తన దగ్గరున్న మొబైల్ నుండి 112కు కాల్ చేసి(Police help line number 112) అక్కడ జరుగుతున్న బాల్యవివాహం గురించి చెప్పింది. దీంతో పోలీసులు పెళ్ళి వేడుక జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకున్న తరువాత జిల్లా మహిళా రక్షణ, బాల్యవివాహాల నిషేద అధికారికి(Child marriage prohibition officer) సమాచారం అందించారు.

బాల్యవివాహాల నిషేద అధికారి అక్కడికి చేరుకుని అమ్మాయి వయసు ధృవీకరణ పత్రం(Age proof) చూపించమని అడిగింది. దీంతో అమ్మాయి తండ్రి ఆమె 10వతరగతి మార్క్ కార్డ్ చూపించాడు. అందులో ఉన్న సంత్సరం ప్రకారం అమ్మాయికి 18ఏళ్ళా 2 నెలల వయసు. దీంతో ఆ అధికారి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. అధికారి అక్కడ ఉన్నట్టే పెళ్ళి పనులు తిరిగి మొదలయ్యాయి. అయితే ఆ అధికారి అంతటితో వెనుదిరగకుండా జిల్లా ఆసుపత్రిలోనూ(District hospital), అంగనవాడీ రిజిస్టర్లలోనూ(Anganwadi register) చెక్ చేయించింది. దీంతో ఆ అమ్మాయి వయసు ఇంకా 16ఏళ్లేనని తేలింది. నకిలీ సరిఫికెట్లు సృష్టించి విషయాన్ని తప్పుదోవ పట్టించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది. మొత్తానికి వధువు తన స్నేహితురాలితో కలసి చేసిన ఒక్క ఫోన్ కాల్ వల్ల ఆ పెళ్ళి ఆగిపోయింది. వరుడు, అతని కుటుంబం ఒట్టి చేతులతో తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు.

Updated Date - 2023-05-23T17:30:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising